Former Delhi CM Arvind Kejriwal: అప్పట్లో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. అన్నా హజారేకు అప్పటి సివిల్ సర్వెంట్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు.. అనంతరం తన సర్వీస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. కొంతకాలానికి రాజకీయ పార్టీని స్థాపించారు. దానికి ఆమ్ ఆద్మీ అని పేరు పెట్టారు. ఈ పార్టీ ఏర్పాటును అన్నా హజారే ఒప్పుకోలేదు. అయినప్పటికీ అరవింద్ పార్టీ ఏర్పాటు వైపే ముందుకు వెళ్లారు.. పార్టీని ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శిష్ మహల్ ను అత్యంత ఖరీదైన భవంతిగా మార్చుకున్నారు.. అందులో సెవెన్ స్టార్ సౌకర్యాలు కల్పించుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. తన సౌభాగ్యాల కోసం.. తన సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని విమర్శలు వినిపించాయి.. దీనిపై జాతీయ మీడియా సంస్థలు కూడా పరిశోధనాత్మక కథనాలను ప్రసారం చేశాయి.. దీనిపై అరవింద్ ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ.. ఢిల్లీ ఓటర్లు ఆప్ పార్టీని నమ్మలేదు. బిజెపికి ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించారు.
Also Read: పీఓకేలో భారీ కుదుపు.. పాకిస్తాన్ లో మరో అంతర్యుద్ధం
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పంజాబ్ ప్రాంతంలోనే దాదాపు స్థిరపడిపోయారు.. పంజాబ్ ప్రాంతంలో ఆయన ఏకంగా 7 స్టార్ సౌకర్యాలతో భవంతి నిర్మించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న స్వాతి మాలివాల్ సంచలన ఆధారాలను బయటపెట్టారు. అంతేకాదు అరవింద్ ఇకపై ఢిల్లీలో ఉండే అవకాశం లేదని.. ఆయన పంజాబ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. అందువల్లే ఢిల్లీ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బుతో సకల సౌకర్యాలతో భవనం నిర్మించుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.. పంజాబ్ ముఖ్యమంత్రి అరవింద్ అక్రమాలకు సహకరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. ఆప్ కూడా ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంది. ఒకప్పుడు తనకు ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదని.. కనీసం జీతం కూడా తీసుకోకుండా పనిచేస్తానని చెప్పిన అరవింద్.. ఇప్పుడు సెవెన్ స్టార్ సౌకర్యాలతో బిల్డింగ్ నిర్మించుకోవడానికి చాలామంది తప్పు పడుతున్నారు.