Delhi Kapashera Accident: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులకు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ నేపథ్యంలో అసలు వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. వారు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారికి దిమ్మ తిరిగిపోయే నిజం తెలిసింది. అది కాస్త అనేక మలుపులు తిరిగి చివరికి పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాన్ని తెలిసేలా చేసింది.
ఢిల్లీలోని కపాషేరా అనే ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం నిత్యం బిజీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో వాహనాలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో ఒక బైకు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో రోహిత్, కరం జీత్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు కనిపించారు.. పోలీసులు వారిని చూడగానే అనుమానస్పదంగా ప్రవర్తించారు. పోలీసులు అక్కడ వివరాలు సేకరిస్తుండగా కరంజిత్ వద్ద ఓ అనుమానాస్పదమైన మొబైల్ ఫోన్ లభించింది. దీంతో వారిపై పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఫలితంగా ఈ కేసును మరింత లోతుగా విచారించారు. వాస్తవానికి అదే రోజు తెల్లవారుజామున ఒక ఇంట్లో వీరిద్దరూ దొంగతనం చేశారు. పోలీసులు విచారిస్తుండగా ఆ విషయాన్ని వారు ఒప్పుకున్నారు. ఢిల్లీలోని లాల్ చంద్ అనే వ్యక్తి ఇంట్లో ఒక సంచి.. మూడు స్మార్ట్ ఫోన్లు దొంగిలించినట్టు కరంజిత్, రోహిత్ ఒప్పుకున్నారు.. దీంతో పోలీసులు వారిద్దరి నుంచి దొంగిలించిన సంచి, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు విచారణలో పోలీసులకు మరో సమాచారం తెలిసింది. వారిని విచారిస్తుండగా లాల్ చంద్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. తన వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కరం జీత్, రోహిత్ దొంగిలించిన వస్తువులు లాల్ చంద్ కు చెందినవని నిర్ధారించారు. అయితే ఈ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రోహిత్, కరంజిత్ దొంగిలించిన వస్తువులను పంకజ్ అనే వ్యక్తికి అమ్ముతుంటారు. పోలీసుల విచారణలో ఈ విషయం తెలిసింది. పంకజ్ ఆ వస్తువులను విక్రయించి వచ్చిన సొమ్మును మూడు వాటాలు వేస్తాడు. ఆ మూడు వాటాలను ముగ్గురు తీసుకుంటారు.. అయితే ఇప్పటివరకు వీరు అనేక విలువైన వస్తువులను దొంగిలించారని తెలుస్తోంది. వారి వద్ద నుంచి అనేక వస్తువులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు.. వారిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.