TANA : తానా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించిన మాజీ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉందని తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తానాలో ఇంతకుముందు ఎప్పుడూ చోటు చేసుకోని ఈ ఘటనపై నవంబర్ 25న అత్యవసర బోర్డ్ సమావేశాన్ని నిర్వహించామని డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు. ఈ సమావేశానికి శ్రీకాంత్ పోలవరపు హాజరై, తన తప్పిదాన్ని అంగీకరించడమే కాకుండా, పూర్తి బాధ్యత తానే వహిస్తానని స్పష్టంగా తెలిపారు. నిధుల మళ్లింపు చర్య తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, దీని గురించి మరెవ్వరికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ తన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా సమర్పించగా, దానిని మేము ఆమోదించామని డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు. ఇప్పటికే లక్ష డాలర్లు తిరిగి చెల్లించిన శ్రీకాంత్, మళ్లించిన మొత్తం $3.6 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
దారి మళ్లించిన నిధులను పూర్తిగా తిరిగి రాబడేందుకు తానా బోర్డ్ చట్టబద్ధంగా, న్యాయపరంగా, మరియు FBI సహాయంతో ముందుకు సాగుతున్నామని డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కఠిన మార్గదర్శకాలతో సాంకేతిక , పరిపాలనా చర్యలు అమలు చేస్తామని, తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియజేశారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: This is the information about tana foundation funds
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com