Homeప్రవాస భారతీయులుTANA: తానా ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌.. 3 మిలియన్‌ డాలర్ల నిధులకు హామీ!

TANA: తానా ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌.. 3 మిలియన్‌ డాలర్ల నిధులకు హామీ!

TANA: అమెరికాలో తెలుగువారి ఐక్యత కోసం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ తానా. 1974లో ఏర్పాటు చేసిన తానా.. దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐదేళ్ల కోసారి ద్వైవార్షిక సమావేశం నిర్వహిస్తోంది. ఏటా తెలుగు పండుగలు, వేడుకలు, ఉత్సవాలు అమెరికాలో నిర్వహిస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తోంది. అమెరికాకు వచ్చేవారికి సహాయ సహకారాలు అందిస్తోంది. అమెరికాలో పుట్టి పెరిగిన వారికి తెలుగు భాషతోపాటు మన సంస్కృతి, కట్టు, బొట్టు, పండుగలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇక ఐదేళ్లకోసారి నిర్వహించే ద్వైవార్షిక సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులతోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి నటీనటులను పిలిపించి గ్రాండ్‌గా వేడుకలు నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది 16 ద్వైవార్షిక సమావేశం జరుగనుంది. ఇందుకు తానా ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తోంది. ఇందలో భాగంగా కిక్‌ ఆఫ్‌ ఫండ్‌ రైజింగ్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తాజా ఈవెంట్‌ సక్సెస్‌..
2025, జూలై 3న నిర్వహించే తానా మహా సభలకు సంబంధించి అక్టోబర్‌ 19న సెయింట్‌ తోమా చర్చిలో చేపట్టిన కిక్‌ ఆఫ్‌ ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ విజయవంతమైంది. డోనర్ల నుంచి 3 మిలియన్‌ డాలర్ల మేరకు హామీ లభించింది. 24వ తానా మహా సభల కన్వీనర్‌ ఉదయ్‌కుమార్‌ చాపలమడుగు, కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ గంగాధర్‌ నాదెళ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయ్‌కుమార్‌ చాపలమడుగు మాట్లాడుతూ ఈ మహా సభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలతోపాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాన్ని తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సభల వేదిక అందరికీ అందుబాటలో ఉండాలన్న ఉద్దేశంతో డెట్రాయిట్‌ సబర్బన్‌ నోవీలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేను ఎంపిక చేశామన్నారు. గతంలో వివిధ సభలు నిర్వహించిన అనుభవంతో దైవ్వార్షిక సభలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. డెట్రాయిట్‌ సబర్బన్‌లోని నోవైలో ఉన్న తెలుగు కమ్యూనిటీ, డీటీఏ నాయకులు ఇందులో భాగస్వాములవుతారన్నారు. అందరి సహకారంతో ఈ సభలను విజయవంతం చేస్తామన్నారు.

విరాళాలకు హామీ..
ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు నిధులకు హామీ ఇచ్చారు. సుమారు 3 మిలియన్‌ డాలర్ల నిధులకు హామీ లభించిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌శ్రీనివాస్‌ కోనేరు, డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, సెక్రెటరీ కిరణ్‌దుగ్గిరాల, ట్రెజరర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా నార్త్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ నీలిమ మన్నెతోపాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నుంచి ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ నరేన్‌ కొడాలి, కార్యదర్శి రాజు కసుకుర్తి, ట్రెజరర్‌ భరత్‌ మద్దినేని, ఇతర సభ్యులు పాల్గొన్నారు. డెట్రాయిట్‌ తరఫున తానాకు సేవలు అందించిన 30 మందిని ఈ వేదిక మీద సత్కరించారు. ఈ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి 500 మందికిపైగా హాజరయ్యారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version