Internet Cables: సముద్ర గర్భంలో ఇంటర్నెట్‌ కేబుళ్లు.. తెగిపోతే ఎలా రిపేర్‌ చేస్తారో తెలుసా?

ప్రస్తుతం అంతా డిజిటల్‌ యుగం. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. చేతిలో ఫోన్‌ పట్టుకుని మాట్లాడే స్తాయి. వీడియో కాల్‌ చేసే స్థాయికి ఎదిగింది. దీని వెనుక మాటల్లో చెప్పలేనంత కృషి ఉంది.

Written By: Raj Shekar, Updated On : October 22, 2024 9:12 pm

Internet Cables

Follow us on

Internet Cables: ప్రపంచంలో డిజిలట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ 99 శాతం సముద్రగర్బంలోని కేబుళ్లపై ఆధారపడి ఉంటుంది. వీటిద్వారానే సమాచారం ప్రసారం అవుతోంది. ఫైబర్‌ కేబుళ్లను సముద్రమార్గలంలో వేయడం ద్వారా సాంకేతికత ప్రసారం జరుగుతోంది. భూమిపై విస్తరించి ఉన్న మహా సముద్రాలన్నింటిలో కలిపి 14 లక్షల కిలోమీటర్ల పొడవైన టెలి కమ్యూనికేషన్‌ కేబుళ్లు ఉన్నాయి. వాటిని సరళ రేఖగా పేరిస్తే సూర్యుని వ్యాసం అంత పొడవుగా కనిపిస్తాయట. ఇంత పొడవుడే కేబుళ్లు సైజులో కేవలం 2 సెంటీమీటర్ల వ్యాసంతో మాత్రమే ఉంటాయి. ఈ కేబుల వ్యవస్థలో లోపాలు సరిచేయడం, వాటిని నిరంతరం పర్యవేక్షించడం 19వ శతాబ్దం మధ్య నుంచే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యవస్థ విస్తరిండచం అప్‌డేట్‌ చేయడం జరుగుతూనే ఉంది. సముద్రగర్భంలో ఈ కేబులింగ్‌ వ్యవస్థ అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు కారణమైంది. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మన రోజువారీ జీవితం, ఆదాయం, ఆరోగ్యం, భద్రత ఇలా అన్ని అంశాలకూ ఇంటర్నెట్‌పై ఆధారపడడం పెరిగింది. దీనికోసం క్లిష్టమైన సముద్రగర్భంలోని కేబుళ్ల నెట్‌వర్క్‌పై ఆధారపడాల్సిందే మరి ఇవి పాడైనా.. తెగిపోయినా ఏమవుతుంది. ఎప్పుడైనా జరిగిందా.. జరిగితే తలెత్తే పరిణమాలు ఏంటి.. మరమ్మతులు ఎలా చేస్తారు అనేవి తెలుసుకుందాం.

వాటికవే మరమ్మతు…
చాలా వరకు గ్లోబల్‌ నెట్‌వర్క్‌లు ఏవైనా సమస్యలు వస్తే మరమ్మతులు చేసుకోగలవు అని సముద్రగర్భ వ్యవస్థలపై తీవ్రమైన పరిణామాలను చూసే ప్రభావాన్ని అధ్యయనం చేసే ఇటర్నేషనల్‌ కేబుల్‌ ప్రొటెక్షన్‌ కమిటీ మెరైన్‌ ఎన్నివరాన్‌మెంట్‌ అడ్డయిజర్‌ మైక్‌క్లేర్‌ తెలిపారు. ఈ గ్లోబల్‌ గ్రిడ్‌కు ఏటా 150 నుంచి 200 వరకు సమస్యలు తలెత్తుతున్నాయని, 14 లక్షల కిలోమీటర్ల పొడవైన వ్యవస్థలో ఈ సమస్యలు చాలా చిన్నవని పేర్కొన్నారు. నష్టం కూడా తక్కువే అని తెలిపారు. 19వ శతాబ్దంలో ట్రాన్స్‌ – అట్లాంటిక్‌ కేబుళ్లు వేయడం ప్రారంభించినప్పటి నుంచి తీవ్రమైన పర్యావరణ ముప్పులబారిన పడ్డాయి. సముద్రగర్భంలో వచ్చే అగ్ని పర్వతాల విస్పోటనాల నుంచి తుపాన్లు, వరదల వరకు ఈ కేబుల్‌ వ్యవస్థను చాలాసార్లు దెబ్బతీశాయి. అయితే కేబుళ్లకు సహజసిద్ధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టం చాలా తక్కువ. ప్రపంచంలో 70 నుంచి 80 శాతం వరకు కేబల్‌ ప్రమాదాలు మానవ చర్యలతోనే ముడిపడ్డాయి.

అందుబాటులో ఆర్మీ రిపేర్‌ షిప్‌లు…
కేబుల్‌ వ్యవస్థకు సముద్రగర్భంలో ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే రిపేర్‌ చేయడానికి షిప్‌లను పంపిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనౌకలన్నీ వాటి బేస్‌ల నుంచి 10 నుంచి 12 రోజుల్లో చేరుకునేలా వ్యూహాత్మకంగా క లిపి ఉంచుతారు అని ల్కాటె సబ్‌మెరైన్‌ నెట్‌వర్క్స్‌ మారిటైమ్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ మిక్‌ మెక్‌ గవర్న్‌ తెలిపారు. మరోవైపు చాలా దేశాలు ప్రత్యామ్నాయ కేబుళ్లను, బ్యాండ్‌విడ్త్‌ను నిర్వహిస్తుంటాయి. అవసరమైనదానికంటే ఎక్కువగా వీటిని అందుబాటులో ఉంచుతాయి. కేబుల్‌ డ్యామేజీ అయినప్పుడు వెంటనే మిగిలినవి పనిచేస్తాయి. దీనినే సిస్టమ్‌ రిడండెన్సీ అంటారు. దీనికారణంగా సముద్రగర్భంలో కేబుళ్లు పాడైన విషయం కూడా చాలా మందికి తెలియదు. 2006లో వచ్చిన భూకంపం కారణంగా దక్షిణ చైనా సముద్రంలో డజన్ల కొద్దీ కేబుళ్లు దెబ్బతిన్నాయి. కానీ, వాటిల్లో చాలా వరకు అందుబాటులోనే ఉన్నాయి. పాడైన భాగానికి మరమ్మతులు చేసేందుకు గ్రాఫ్లింగ్‌ హుక్‌ ద్వారా పైకి తీసి కేబుల్‌ కట్‌ చేస్తారు. వదులుగా ఉన్న చివరి భాగాన్ని ఉపరితలానికి తీసుకువస్తారు. పాడైన భాగాన్ని నౌకలో ఓ గదికి తీసుకొచ్చి లోపాలు గుర్తిస్తారు. తర్వాత రిపేర్‌ చేసి నౌక నుంచి తీఆరానికి సిగ్నల్‌ పంపి పరీక్షించి సీల్‌ వేస్తారు. మరమ్మతు చేసిన కేబుళ్లను తిరిగి నీటిలోకి దింపుతారు. నౌకలు ఎక్కువగా తిరిగే సముద్రమార్గాల్లో వాటిని కందకాల్లో పూడ్చిపెడతారు.