Homeప్రవాస భారతీయులుOhio TANA Volleyball Tournament 2026: తెలుగు యువతలో క్రీడాస్ఫూర్తి వికాసం – విశేష స్పందన

Ohio TANA Volleyball Tournament 2026: తెలుగు యువతలో క్రీడాస్ఫూర్తి వికాసం – విశేష స్పందన

Ohio TANA Volleyball Tournament 2026: కోలంబస్: ఉత్తర అమెరికాలోని తెలుగు సంఘం Telugu Association of North America (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓహియో వ్యాలీ ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ కోలంబస్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. మార్చి 1న జరిగిన ఈ క్రీడా పోటీల్లో తెలుగు యువత, క్రీడాకారులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Ohio TANA Volleyball Tournament 2026
Ohio TANA Volleyball Tournament 2026

తానా అధ్యక్షుడు డా. నరెన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు నాయకత్వంలో తానా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందుతున్నాయి. జాతీయ క్రీడా సమన్వయకర్త శివ చావా మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది.
ఓహియో వ్యాలీ ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ చందనం సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగ, నాగేశ్వరరావు మన్నె, వీర ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి చింతొళ్ల, మనోజ్ సిరిగిరెడ్డి, చందు గుమ్మళ్ల, శ్రీకుమార్ కాసా, రాఘవ శ్రీహరి, సురేష్ పార్వతి, రాజేష్, వీరేష్ విల్లిగడ్ల, శ్యామ్ దుద్దెల, విప్పల రెడ్డి, యశ్ కోసన, తేజ తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

Ohio TANA Volleyball Tournament 2026
Ohio TANA Volleyball Tournament 2026

విజేతలు – రన్నరప్ జట్లు
డివిజన్–1 విభాగంలో Night Fury’s జట్టు (కెప్టెన్ ప్రకాశ్ కటకం) విజేతగా నిలిచింది. Cleveland Setters జట్టు (కెప్టెన్ బాలా నెట్టెం) రన్నరప్‌గా నిలిచింది.

డివిజన్–2 విభాగంలో KMA జట్టు (కెప్టెన్ హర్ష పొలవరపు) విజేతగా నిలవగా, Volley Aces జట్టు (కెప్టెన్ రాంబాబు) రన్నరప్‌గా నిలిచింది.

విజేతలు, రన్నరప్ జట్లకు ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో స్థాపక సభ్యుడు నాగేశ్వరరావు మన్నె, మాజీ అధ్యక్షురాలు వాణి గడ్డె ట్రోఫీలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి శ్రీ సాయి బాబా దేవాలయం బోర్డు చైర్మన్ తేజో వట్టి, శ్రీ వెంకటేశ్వర దేవాలయం అధ్యక్షుడు వెంకట్ కుసుమాంచి, ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో మాజీ అధ్యక్షుడు సుధాకర్ అల్వాల, కమ్యూనిటీ నాయకులు శ్రీనివాస్ బొద్దు, భరత్ జటప్రోలు తమ మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ చందనం తానా జాతీయ అధ్యక్షుడు డా. నరెన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అందించిన ప్రోత్సాహం మరియు నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సత్య నిమ్మల మరియు మాజీ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ సంగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో తానా నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు అమెరికాలోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version