Gokarna: బీచ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కాస్త సమయం దొరికితే చాలు.. బీచ్‌కి వెళ్లి సేద తీరాలని అనుకుంటారు. ఎందుకంటే బీచ్‌లో కూర్చొంటే ఎన్ని సమస్యలు ఉన్న కూడా ఒక్కసారిగా ఖతం అయిపోతాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌లు ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం బీచ్‌లు లేవు. హైదరాబాద్ నుంచి బీచ్‌కి వెళ్లాలంటే.. ఏపీ, చెన్నై, కర్ణాటక వెళ్లాలి. ఇందులో ఎక్కువగా కర్ణాటకలోని గోకర్ణకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఇక్కడి ఉండే బీచ్ అందాలు, శివుడు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్లు బీచ్‌లు చూడాలనుకుంటే ఈ గోకర్ణ ట్రిప్ సూపర్ అని చెప్పవచ్చు. ఈ గోకర్ణలో కేవలం ఒక బీచ్ మాత్రమే కాకుండా చాలా రకాల బీచ్‌లు ఉన్నాయి. అయితే కొందరికి వెళ్లాలని ఉన్నా కూడా బడ్జెట్ విషయంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీలాంటి వారి కోసమే తక్కువ బడ్జెట్‌లో గోకర్ణ ట్రిప్‌ను కేవలం మూడు రోజుల్లో చూట్టేసి రావడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రకృతి అందాలకు గోకర్ణ నిలయం. ఇక్కడ ఉండే సుందరమైన ప్రదేశాలు టూరిస్టులను ముగ్ధులను చేస్తాయి. అయితే హైదరాబాద్ నుంచి తక్కువ ఖర్చుతో గోకర్ణకు వెళ్లవచ్చు. కనీసం మూడు రోజులు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా అన్ని ప్రదేశాలను చుట్టేసి రావచ్చు. హైదరాబాద్ నుంచి గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్ లేదు. హుబ్లీ వరకు ట్రైన్‌లో వెళ్లి అక్కడి నుంచి బస్సుకి వెళ్లాలి. హైదరాబాద్ నుంచి హుబ్లీకి స్లీపర్ క్లాస్‌లో ఒక సైడ్ టికెట్ కాస్ట్ రూ.370 ఉంటుంది. రెండు వైపులా రూ.740 అవుతుంది. హుబ్లీ నుంచి గోకర్ణకు బస్‌లోఒక సైడ్ టికెట్ ధర రూ.178 అవుతుంది. రెండు వైపులా చూసుకుంటే రూ.356 అవుతుంది. అయితే వెళ్లి రావడానికి రూ.1100 అవుతుంది. మూడు రోజులు కాబట్టి ఒక రోజు స్టేకి కనీసం రూ.500 ఉంటుంది. మీరు రిచ్ హాటల్ తీసుకుంటే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే డార్మిటరీలో ఉంటే ఇంకా తక్కువ అవుతుంది. భోజనాలకి ఒక రూ. 300 నుంచి రూ.400 వరకు ఉంటుంది.
గోకర్ణలో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి లోకల్ ట్రాన్స్‌పోర్టు లేదా టూ వీలర్ అద్దె తీసుకుని తిరిగితే మీకు ఖర్చు తక్కువగా అవుతుంది. ఫుడ్, స్టే, టికెట్లు అన్ని కలిపి రూ.2000 అయిన కూడా వెహికల్ రెంట్‌కి, బయట తిరగడానికి కనీసం ఒక రూ.2000 వరకు కావచ్చు. ఇవన్నీ మీ పర్సనల్‌గా చేసే ఖర్చుల బట్టి ఉంటుంది. గోకర్ణలో ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాలు మహాబలేశ్వర్ టెంపుల్, రామ తీర్థ, కోటి తీర్థ, శివ గుహలు, మురుడేశ్వర్ ఆలయం, రాజ గోపురం, యానా కేవ్స్, జోగ్ వాటర్ ఫాల్స్, విభూతి వాటర్ ఫాల్స్ చూడవచ్చు. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మూడు రోజుల్లోనే తక్కువ ఖర్చుతో చూసేయవచ్చు. కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేలలో గోకర్ణలో ఉన్న అందమైన ప్రదేశాలు అన్ని చూసేయవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మీరు గోకర్ణ ట్రిప్‌కు ప్లాన్ చేసేయండి.