Pawan Kalyan daughter : నేడు విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ఓజీ(They Call Him OG) కి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని చూసి అభిమానులు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఒక సరైన సినిమా పడింది అనే ఫీలింగ్ ని కల్పించింది ఈ చిత్రం. అయితే చాలా సినిమాలకు థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంటుంది కానీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. ఓజీ చిత్రం కూడా అలా అవుతుందా అనే సందేహాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది మరి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంటుంది, కానీ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అత్యధిక శాతం మంది అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు కానీ, కొంతమంది లో మాత్రం ఆ భయం అలాగే ఉండిపోయింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమే. కానీ సెంటిమెంట్, ఎమోషన్స్ వంటివి చాలానే ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది కానీ, స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ నే వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన కొంత మంది ప్రముఖులు. ఒకప్పుడు తన భార్య కి తెలియకుండా ముంబై లోని అండర్ వరల్డ్ డాన్ గా కొనసాగుతున్న ఓజాస్ గంభీర, తన శత్రువు కారణంగా భార్య ని కోల్పోతాడు. అప్పటికే గంభీర కి చిన్న పాప కూడా ఉంటుంది. దానిని మనం ట్రైలర్ లో గమనించవచ్చు. ఈ గ్యాంగ్ స్టర్ గొడవల్లో ఏ రోజు అయినా తాను చనిపోయే అవకాశం ఉంటుందని, తన భార్య ని కోల్పోయినట్టే బిడ్డని కూడా కోల్పోవాల్సి వస్తుంది అనే భయం తో తన బిడ్డని అక్కా బావ వద్ద వదిలి అజ్ఞాతం లోకి వెళ్ళిపోతాడు ఓజాస్ గంభీర.
అయితే పాప కొద్దిగా పెరిగి పెద్దయ్యాక, జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఓజాస్ శత్రువులు అతని కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఓజాస్ గంభీర్ మళ్లీ అజ్ఞాతం నుండి ముంబై లోకి అడుగుపెట్టి ఎలా తన సంతృవులను మట్టి కురిపించాడు అనేదే సినిమా స్టోరీ. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ స్టోరీ సినిమానే. కానీ టేకింగ్ మీదనే ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది తెలుస్తుంది. అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి, ఆ అంచనాలను ఈ చిత్రం ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి.