Homeటాప్ స్టోరీస్Dr.Uma Katiki Aramandla : సేవే నాయకత్వానికి నిజమైన నిర్వచనం.. ‘పింక్ సారీ ఔట్‌స్టాండింగ్ కమ్యూనిటీ...

Dr.Uma Katiki Aramandla : సేవే నాయకత్వానికి నిజమైన నిర్వచనం.. ‘పింక్ సారీ ఔట్‌స్టాండింగ్ కమ్యూనిటీ లీడర్ అవార్డు’ అందుకున్న డా. ఉమా కటికి (ఆరమండ్ల) 

Dr.Uma Katiki Aramandla :  సమాజ సేవే లక్ష్యంగా.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. యువతకు మార్గదర్శకత్వం అందిస్తూ  సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమా కటికి (ఆరమండ్ల) గారికి అరుదైన గుర్తింపు లభించింది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన ‘బ్యూటిఫుల్ మైండ్స్ పింక్ సారీ ఔట్‌స్టాండింగ్ కమ్యూనిటీ లీడర్ అవార్డు’ ప్రదానం చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధి నటాలీ మ్యాన్లీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం విశేషం. […]

Dr.Uma Katiki Aramandla :  సమాజ సేవే లక్ష్యంగా.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. యువతకు మార్గదర్శకత్వం అందిస్తూ  సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా. ఉమా కటికి (ఆరమండ్ల) గారికి అరుదైన గుర్తింపు లభించింది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన ‘బ్యూటిఫుల్ మైండ్స్ పింక్ సారీ ఔట్‌స్టాండింగ్ కమ్యూనిటీ లీడర్ అవార్డు’ ప్రదానం చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధి నటాలీ మ్యాన్లీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం విశేషం. ఈ గుర్తింపు వ్యక్తిగత విజయంగా మాత్రమే కాకుండా  సమాజం కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఘట్టంగా నిలిచింది.

సేవా మార్గంలో మరో మైలురాయి
నాయకత్వం అంటే కేవలం హోదా, పదవి లేదా గుర్తింపు మాత్రమే కాదని.. ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే అసలైన నాయకత్వమని ఈ అవార్డు అందుకున్న తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్  డా. ఉమా కటికి (ఆరమండ్ల)  అభిప్రాయపడ్డారు. మహిళలకు అండగా నిలవడం.. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం తన నాయకత్వ ప్రయాణంలో ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

సమాజ సేవలో కరుణ, బాధ్యత, నిబద్ధత ఎంతో ముఖ్యమని డా. ఉమా గారు విశ్వసిస్తున్నారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా వారి జీవితాల్లో ఆశను నింపవచ్చని.. చిన్న ప్రయత్నాలు కూడా సమాజంలో గొప్ప మార్పులకు దారితీయగలవని ఆమె సందేశమిచ్చారు. తానా మరియు ఇతర ఆర్గనైజేషన్స్, కమ్యూనిటీలో  గత కొన్నేళ్లలో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలను అందుకున్నారు డా. ఉమా గారు. అసహాయులకు సాయం చేశారు.  ఎంతో మందికి తానా తరుఫున సహాయ సహాకారాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీంతోనే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం డా. ఉమా గారికి దక్కింది.  ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణనిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రముఖుల సమక్షంలో పురస్కార ప్రదానం
ఈ కార్యక్రమంలో బ్యూటిఫుల్ మైండ్స్ లీడర్‌షిప్‌కు చెందిన సూచిస్మిత, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధులు జానెట్ యాంగ్ రోహర్ (41వ జిల్లా), డాగ్మారా అవేలార్ (85వ జిల్లా), భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి చెందిన లిమా మాథ్యూస్, బోలింగ్‌బ్రూక్ మేయర్ మేరీ అలెగ్జాండర్ బాస్టా, ట్రస్టీ భావిని పటేల్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ గుర్తింపు లభించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సమాజ సేవలో ముందుండే వ్యక్తులను గుర్తించడం, సేవా కార్యక్రమాల ద్వారా సానుకూల మార్పును తీసుకువచ్చే వారిని గౌరవించడం వంటి లక్ష్యాలకు ఈ అవార్డు ప్రాధాన్యతను చాటిచెప్పింది.
గుర్తింపుతో ఆగని సేవా ప్రయాణం
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా డా. ఉమా గారు తనకు అండగా నిలిచిన పింక్ సారీ బృందానికి  తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తి సాధించిన విజయం వెనుక కుటుంబ సభ్యులు, సహచరులు, మద్దతుదారులు, సమాజం అందించే ప్రోత్సాహం కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Screenshot

నిజమైన నాయకత్వాన్ని అందుకున్న అవార్డుల సంఖ్యతో కాకుండా మన వల్ల సానుకూలంగా మారిన జీవితాలతో కొలవాలని డా. ఉమా గారు సందేశమిచ్చారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, యువతను ప్రోత్సహించడం ద్వారా అర్థవంతమైన మార్పును తీసుకురావాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

Screenshot

గుర్తింపు అనేది ప్రయాణానికి ముగింపు కాదు.. మరిన్ని మంచి పనులు చేయడానికి కొత్త ఆరంభం. సేవను బాధ్యతగా, నాయకత్వాన్ని సమాజ మార్పుకు సాధనంగా భావించే వారికి ఈ పురస్కారం ఒక స్ఫూర్తిదాయక సందేశంగా నిలుస్తోంది. వ్యక్తిగత విజయాన్ని సామాజిక ప్రయోజనంతో ముడిపెట్టినప్పుడే నాయకత్వానికి నిజమైన విలువ లభిస్తుందనే విషయాన్ని డా. ఉమా గారికి దక్కిన ఈ గౌరవం మరోసారి గుర్తుచేస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper