Ramu Venigalla: ఛార్లెట్‌లో రాము వెనిగళ్ల అభినందన సభ.. తరలి వచ్చిన తెలుగు వాళ్లు..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 2019లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వస్తే.. అంతకు మించి అన్నట్లు 164 స్థానాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.

Written By: Raj Shekar, Updated On : August 31, 2024 10:41 am

Ramu Venigalla

Follow us on

Ramu Venigalla: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల తర్వాత మళ్లీ టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ టీడీపీ, జనసేన నాయకులకు బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చింది. కూటమిగా, సమష్టిగా వైసీపీని దెబ్బకొట్టారు. 164 సీట్ల తిరుగులేని మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చారు. దీంతో టీడీజీ, జనసేన, బీజేపీ నాయకులు విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఐదేళ్లు పడిన ఇబ్బంది, కష్టాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. గెలుపు సంబురాల్లో భాగంగా దైవ దర్శనాలు, విహార యాత్రలు, విదేశీ యాత్రలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అయితే విజయాన్ని కాస్త ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీచేసి తనకు తిరుగు లేదనుకున్న కొడాలి నానిని చిత్తుగా ఓడించిన ఎన్నారై రాము వెనిగళ్ల తన విజయాన్ని అమెరికాలోనూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. రాము అవనిగడ్డ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గెలుపు తర్వాత ఎమ్మెల్యేగా మొదటిసారి అమెరికా వెళ్లిన రాము వెనిగళ్లకు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు. అంబరాన్ని తాకేలా సంబురాలు నిర్వహించారు.

ఛార్లెలో అభినందన సభ..
ఎమ్మెల్యేగా అమెరికాకు వచ్చిన ఎన్నారై రామును అమెరికలోని రాము మిత్రులతోపాటు తెలుగురవారు ఘనంగా స్వాగతం పలికారు. కనీ విని ఎరుగని రీతిలో సంబురాలునిర్వహించారు. ఛార్లెట్‌లో ఉన్న ఎన్నారైలు, తెలుగుదేశం పార్టీ అమిమానులు, తెలుగు ప్రజలు రాముకు ఆత్మీయ అభినందన సభ, సత్కారం నిర్వహించారు. నార్త్‌ కరోనిలినాలోని హంటర్స్‌ విల్లే, గ్రీన్‌ మేనర్‌ ఫామ్స్‌లో జరిగిన అభినందన సభలో వర్కింగ్‌ డే అయినా దాదాపు 400 మంది ఎన్నారైలు వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో సభకు రావడం సభకు మరింత శోభ తెచ్చింది. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రులు ఆరాధ్య దైవంగా భావించే అన్న నందమూరి తారకరామారావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాము వెనిగళ్లను వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.

మీ ఆత్మీయం మర్చిపోను..
ఈ సభలో రాము వెనిగళ్ల మాట్లాడూ ఎన్నారైల ఆత్మీయ సత్కారం. సహకారం ఎన్నటికీ మర్చిపోనన్నారు. అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తూ, మరోవైపు జన్మభూమి ప్రగతికి తోడ్పాటును అందిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివంటూని అన్నారు. తన గెలుపులో కూడా ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి కోసం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నారైలు కూడా ముందుకు వచ్చి జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. ఏపీలో వివిధ రంగాలకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మానవవనరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఎన్నారైలు పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని కోరారు.

ప్రశంసలు కురిపించిన ఎన్నారైలు..
ఇదిలా ఉంటే.. ఈ సభలో ఎన్నారైలు మాట్లాడుతూ గత ప్రభుత్వ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి భరించలేకనే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు. వైసీపీని చిత్తుగా ఓడించారని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము కూటమి అభ్యర్థులకు మ ద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్లినప్పుడు ప్రజలు చెప్పిన విషయాలను వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఛార్లెట్‌ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నితిన్‌ కిలారు, నాగ పంచుమర్తి, ఠాగూర్‌ మల్లినేని, రమేష్‌ ముకుళ్ల, బాలాజి తాతినేని, కిరణ్‌ కొత్తపల్లి, సతీష్‌ నాగభైరవ, మాధురి యేలూరి మరియు ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరచారు. ఎన్నారై టీడిపితోపాటు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.