Kadambari Jethwani: జెత్వానిపై ప్లాన్ బీ రెడీ చేసిన వైసీపీ.. హీరోయిన్ పై దేశవ్యాప్తంగా కేసులు వెలుగులోకి.. ప్లాన్ ఇదే

దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ విస్తరిస్తోంది. బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానిపై అక్రమంగా కేసులు పెట్టి ఇరికించారని ఏపీ పోలీసులు గుర్తించారు. ఇదంతా ఓ పారిశ్రామిక వేత్త కుటుంబం కోసమేనని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 31, 2024 10:29 am

Kadambari Jethwani(1)

Follow us on

Kadambari Jethwani: కాదంబరి జెత్వానిపై దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయా? ఆమె మాయ కి’లేడి’యా? పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సభ్యులను ట్రాప్ చేస్తారా? విదేశీ నిఘా సంస్థల కోసం పనిచేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియాలో దీనినే హైలెట్ చేస్తున్నారు. ఆమె కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ను మోసం చేయడంతో.. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు దర్యాప్తు చేశారన్నది ఈ కథనం సారాంశం. ఏపీ పోలీసుల దర్యాప్తులో దేశవ్యాప్తంగా ఆమెపై నమోదైన కేసులు బయటపడ్డాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముంబై, పూణే, ఢిల్లీలో ప్రముఖులను టార్గెట్ చేసుకొని ఆమె మోసాలకు పాల్పడ్డారని.. ఆమెపై అక్కడి పోలీసులకు ఫిర్యాదులు కూడా వచ్చాయని… ఎఫ్ ఐ ఆర్ లు సైతం నమోదయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేవలం వైసీపీ టార్గెట్ చేసేందుకే ముంబై నటి జెత్వానిని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై టిడిపి సైతం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆమె అంత సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే అప్పట్లో ఎందుకు బయట పెట్టలేదని.. ఓ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రయోగించి ఆమెపై కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నిస్తున్నారు.

* స్వతహాగా డాక్టర్
ముంబై నటి జెత్వాని సినిమాలతో పాటు సీరియల్లో నటిస్తూ ఉంటారు.స్వతహాగా ఆమె డాక్టర్ అని తెలుస్తోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వ్యక్తిగత వివాదాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల వేధింపులు బయటపడ్డాయి. వివాహేతర సంబంధాలు వెలుగు చూశాయి. ఇప్పుడు జెత్వాని అంశం అదే కోవలోకి చెందినది. అయితే ఓ పారిశ్రామిక వేత్త కోసం ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందన్నదే ఇప్పుడు హైలైట్ అవుతోంది.

* అదేపనిగా ఎల్లో మీడియా
సహజంగా ఎల్లో మీడియా బాధితురాలి తరఫున నిలబడుతుంది. ఆమె ఆరోపణలు చేస్తోంది వైసీపీ నేతలపై. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉంది. నాటి పెద్దల ప్రోత్సాహం ఉంది. అందుకే ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపిస్తోంది. వరుసగా కథనాలు ప్రచురిస్తోంది. చానళ్లలో డిబేట్ లు పెడుతోంది. అదే సమయంలో వైసీపీ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియా సైతం రెచ్చిపోతోంది. ఆమె వ్యక్తిగత వ్యవహార శైలిని సైతం బయటపెడుతోంది. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని కూడా చెబుతోంది.

* వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహం
ఒక్క మాట మాత్రం నిజం.జెత్వాని కేసు విషయంలో నాటి వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహం చూపించింది. ఆమె వ్యక్తిత్వాన్ని పక్కన పెడితే… ఆమెపై తప్పుడు కేసులు పెట్టి… ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. సజ్జన్ జిందాల్ పై ఆమె కేసు పెడితే ముంబై పోలీసులు చూసుకుంటారు. ఏపీ పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యారు? ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎందుకు ఆసక్తి చూపారు? విమానంలో వెళ్లి మరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? విజయవాడ తీసుకొచ్చి ఆమెతో బేరం ఎందుకు పెట్టారు? ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదు ఎందుకు? ఇక్కడ ఆమెపై ఉన్నపలం గా కేసులు ఎందుకు ఎత్తివేశారు? ముంబై కేసును ఆమె ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు? ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినవే? కానీ వైసిపి అనుకూల మీడియాకు ఇవి ఏవీ కనిపించడం లేదు.జెత్వాని వ్యక్తిగత వ్యవహారాలను బయటపెడుతుండడం విశేషం.