Paralympics 2024: 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం.. నడుము భాగం చచ్చుబడిపోయింది.. సీన్ కట్ చేస్తే పారా ఒలింపిక్ విన్నర్

పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ అవనీ లేఖారా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంచనాలను అందుకుని బంగారు అధ్యాయాన్ని లిఖించింది. పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నేపథ్యంలో అవనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 10:52 am

Paralympics 2024

Follow us on

Paralympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో స్టార్ షూటర్ అవని సంచలనాలు సృష్టించింది. అంచనాలకు మించి రాణించింది. టోక్యోలో స్వర్ణం సాధించి.. పారిస్ లో దానిని పునరావృతం చేసింది. 11 సంవత్సరాల వయసులో అవని కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె నడుము కింది భాగం వరకు చచ్చు పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అనేక ఆసుపత్రులలో తిప్పించి చికిత్స అందించారు. అనేక చికిత్సల తర్వాత ఆమె కోలుకుంది. ఆ తర్వాత రెండు పారా ఒలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇలా ఆమె బంగారు పతకాలు సాధించి అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రత్యేకగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభకు నిదర్శనంగా నిలబడింది.. అవని నవీ ముంబైలోని లక్ష్య షూటింగ్ క్లబ్ వ్యవస్థాపకురాలు సుమా షిరూర్ నేతృత్వంలో శిక్షణ పొందింది. ఒలింపిక్ మెడల్ సాధించేదాకా తనను తాను ఆవిష్కరించుకుంది. సుమ దగ్గర 2018 నుంచి అవని శిక్షణ పొందుతోంది. సుమ ఒలింపిక్స్ ఫైనలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా. 2018 నుంచి అవని ప్రతి ఏడాది నాలుగు సార్లు లక్ష్య షూటింగ్ క్లబ్ కు వచ్చి శిక్షణ పొందుతోంది. ఇలా శిక్షణ పొంది టోక్యో పారా ఒలింపిక్స్ లో మహిళల ప్రతి మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం దక్కించుకుంది. ఇలా పారా ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ దక్కించుకున్న తొలి భారత మహిళా పారా అథ్లెట్ గా సరికొత్త రికార్డు సృష్టించింది..

టోక్యో ఒలింపిక్స్ అనంతరం..

టోక్యో ఒలింపిక్స్ అనంతరం జరిగిన పారా షూటింగ్ వరల్డ్ కప్ లోనూ అవని స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. జూనియర్, సీనియర్ విభాగాలలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. ఫలితంగా పారా షూటింగ్ భవిష్యత్తు అంతర్జాతీయ స్టార్ గా అవతరించింది. అంతేకాదు పద్మశ్రీ, ఖేల్ రత్న, యంగ్ ఇండియన్ షూటర్, పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను అవని దక్కించుకుంది. ఆమె సాధించిన విజయాలను గుర్తించిన రాజస్థాన్ ప్రభుత్వం అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ గా నియమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భేటీ బచావ్.. భేటీ పడావో కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. మరోవైపు అవని పారిస్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారుల ప్రదర్శన పట్ల భారత జాతి మొత్తం గర్వపడుతోందని వ్యాఖ్యానించారు. క్రీడాకారుల స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు