https://oktelugu.com/

London: భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు

భారత్‌కు చెందిన సాహిల్‌శర్మ(24), మెహక్‌(19)కు 2023లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు లండన్‌లోని క్రోయిడాన్‌లో నివాసం ఉంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 1, 2024 / 08:28 AM IST

    London

    Follow us on

    London: భార్యను హత్య చేసిన కేసులో ఓ భారతీయుడికి లండన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

    కత్తితో పొడిచి..
    భారత్‌కు చెందిన సాహిల్‌శర్మ(24), మెహక్‌(19)కు 2023లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు లండన్‌లోని క్రోయిడాన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా సాహిల్‌ తన భార్యను గతేడాది కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన సాహిల్‌ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మెహక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

    నేరం నిరూపణ..
    సాహిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరు పర్చారు. విచారణలో మోహక్‌ను తానే హత్య చేసినట్లు సాహిల్‌ అంగీకరించాడు. అయితే ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సాహిల్‌కు జీవిత ఖైదు విధించింది. ఒకవేళ అతడు పెరోల్‌ పొందాలనుకుంటే కనీసం 15 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.