China: కరోనా గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు కష్టాలు.. వెంటాడి వేధిస్తున్న చైనా

ప్రపంచాన్ని వణికించిన కరోనా గుట్టును విప్పన మొదటి శాస్త్రవేత్తగా చైనాకు చెందిన జాంగ్‌ నిలిచారు. 2019లో వైర్‌ వ్యాప్తి చెందగా, 2020లోనే కరోనా సీక్వెన్స్‌ను ప్రచురించారు.

Written By: Raj Shekar, Updated On : May 1, 2024 8:23 am

China

Follow us on

China: యావత్‌ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది కరోనా. చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా.. ఈ వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త అప్పుగు గొప్పగా కీర్తించబడ్డాడు. కానీ, ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాడు. చైనా దేశానికి చెందిన ఈ శాస్త్రవేత్త యోంగ్‌ జెన్‌ కొంతకాలంగా ఆ దేశ అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన పనిచేస్తున్న ల్యాబ్‌ నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ల్యాబ్‌ ఎదుటే నిరసన..
అన్ని దారులు మూసుకుపోవడంతో విధిలేని పరిస్థితిలో యోంగ్‌ జెన్‌తోపాటు ఆయన బృందం ల్యాబ్‌ ఎదుటే నిరసనకు దిగింది. ఈమేరకు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆదివారం నుంచి ల్యాబ్‌ బయటే ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై స్పందించాలని ఆయన మీడియా కోరారు. మాట్లాడే పరిస్థితులు లేవని పేర్కొన్నాడు.

కరోనా సీక్వెన్స్‌ను ప్రచురించి గుర్తింపు..
ప్రపంచాన్ని వణికించిన కరోనా గుట్టును విప్పన మొదటి శాస్త్రవేత్తగా చైనాకు చెందిన జాంగ్‌ నిలిచారు. 2019లో వైర్‌ వ్యాప్తి చెందగా, 2020లోనే కరోనా సీక్వెన్స్‌ను ప్రచురించారు. కరోనాకు పుట్టినిల్లుగా చైనాను ప్రకటించాడు. దీంతో నాటి నుంచి ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. డిమోషన్లతోపాటు పలు కార్యక్రమాల్లో బహిష్కరణలు వంటివి ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెంచడంతోపాటు వారిని నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.