Google Vs Apple: అప్పట్లో అనుకుంటా.. అపరిమితమైన మేధాసంపత్తి ఉన్న అధ్యాపకుల కోసం శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల యాజమాన్యాలు కొట్టుకునేవి. కిడ్నాప్ లు చేసేవి. చివరికి పోలీస్ స్టేషన్ల దాకా పంచాయితీ వెళ్ళేది. తర్వాత సెటిల్మెంట్ జరిగేది. ఇలా అప్పట్లో పేపర్లో వారానికో పది రోజులకో ఈ తరహా వార్తలు కనిపించేవి. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చైనా, నారాయణ కలిసిపోయాయి. చైనాగా ఆవిర్భవించాయి. ఇప్పుడు గెట్టు పంచాయతీలు, గట్టుపంచాయతీలు ఏవీ లేవు.. నువ్వు అది పంచుకో, నేను ఇది పంచుకుంటా.. విద్య కూడా ఒక వ్యాపారమే కదా! ఆ వ్యాపారాన్ని అవి దర్జాగా సాగిస్తున్నాయి. ఇలాంటి పంచాయితీ ఇప్పుడు గూగుల్, యాపిల్ మధ్య నడుస్తోంది.. అది ఏకంగా ఆ సంస్థలకు చెందిన ఇద్దరు సీఈవోలు పోటీపడేంతగా వైరం ముదిరింది.
విపరీతమైన చర్చ
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కృత్రిమ మేథ ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. అయితే దీనిని పూర్తిగా నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మనిషికి మాత్రమే సొంతమైన సృజనాత్మకత అంతమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మార్పైనా కొంతవరకు మంచిదే.. కానీ అతిగా జరిగితే అనర్థం తప్పదని టెక్ నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా టెక్ సంస్థలు మాత్రం కృత్రిమ మేధ విషయంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఇక మారిన కంపెనీల అవసరాల దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో సత్తా చాటాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ తో పాటు, ఇందులో కాస్త వెనుకబడి ఉన్న టెక్ దిగ్గజం యాపిల్ సైతం దృష్టిసారించింది. గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ చాట్ జిపిటి ముందంజలో కొనసాగుతూ ఉంటే.. యాపిల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్మరించింది. ఇక మార్కెట్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలతో పోటీ పడలేక ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ జాన్ జియానాండ్రియా ఇబ్బంది పడుతున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చాయి.
భారతీయులు కీలకం
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో ఇద్దరు భారతీయులు శ్రీనివాస్, ఆనంద్ శుక్లా( స్టీవెన్ బాకేర్ కాకుండా) కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరిద్దరు కూడా ఈ అత్యంత మేథో సంపత్తి ఉన్న వ్యక్తుల్లాగా అటు గూగుల్, ఇటు మైక్రోసాఫ్ట్ కంపెనీలకు కనిపిస్తున్నారు. ఎంత ప్యాకేజీ కావాలన్నా అంత చెల్లించి తీసుకుంటామని గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాయి. అయితే వీరు గతంలో యాపిల్ సెర్చ్ టెక్నాలజీ సంస్థలో పనిచేశారు. అక్కడ కంపెనీ వ్యవహారాల నచ్చక బయటికి వచ్చేసారు..గూగుల్ కంపెనీలో చేరారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పై పని చేస్తున్నారు. వీరు ఐఐటీ విద్యను పూర్తి చేశారు. శ్రీనివాస్ వెంకటా చారి, ఆనంద్ శుక్లాను తమతో పాటు ఉంచుకునేందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రయత్నిస్తున్నారు. యాపిల్ సంస్థ నుంచి గూగుల్ కు వెళ్లిన ఆ ఇద్దరిని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలని సీఈఓ టిమ్ కుక్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఐఐటీయన్ల కోసం దిగ్గజ టెక్ సంస్థలు పోటీపడుతున్న తీరు ప్రపంచ టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరీభారతీయులు?
ఐఐటి మద్రాస్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వెంకటాచారి ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రోడక్ట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. మరొకరు ఆనంద్ శుక్లా. శుక్లా గూగుల్లో మంచి పేరున్న ఇంజనీర్ గా చలామణి అవుతున్నారు. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం 2022 అక్టోబర్ నెలలో వెంకటాచారి ఆపిల్ కంపెనీకి రిజైన్ చేశారు..అదే ఏడాది నవంబర్లో యాపిల్ కి గుడ్ బై చెప్పి గూగుల్ లో చేరారు ఆనంద్ శుక్లా. అయితే వీరిద్దరూ గూగుల్ సంస్థలో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. గూగుల్ ఎల్ఎల్ ఎం విభాగంలో పనిచేసేందుకు మంచి ప్రదేశమని వీరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గూగుల్ సీఈఓ ఆలోచనలు తమకు దగ్గరగా ఉండటంతో, వారు కూడా అక్కడ పని చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో టిమ్ కుక్ ఏం చేస్తాడో మరి?!
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Google vs apple heres why sundar pichai and tim cook fought over these two iitians
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com