Apple CEO Tim Cook: ప్రపంచంలో అపర కుబేరులు చాలామంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి టిమ్ కుక్(tim cook) . ఆపిల్ కంపెనీ (Apple company) సీఈవోగా ఈయన ప్రపంచం మొత్తానికి సుపరిచితుడు. తన కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి కూడా. అయితే ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన ఇతడిని అమెరికాలో ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. సాధారణంగా టిమ్ కుక్ కు అసాధారణంగా భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా సెక్యూరిటీ వెంట ఉంటుంది.. అయితే కుక్ ఇటీవల అమెరికాలోని న్యూ ఓర్లిన్స్ లో ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. తర్వాత తనను ఎవరైనా గుర్తుపడతారేమోనని.. సెల్ఫీల కోసం, ఆటోగ్రాఫ్ల కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడతారేమోనని కుక్ భావించాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా అక్కడున్నవారు కుక్ ను గుర్తుపట్టలేదు. కుక్ స్ట్రీట్ ఫుడ్ తింటున్నంతసేపు ఎవరో బయట వ్యక్తి అని భావించారు. అంతేతప్ప ఆపిల్ కంపెనీ సీఈవో అని ఎగేసుకు రాలేదు. అయితే అదే సమయంలో అదే రెస్టారెంట్ కి అమెరికన్ ఫేమస్ ఫుట్ బాలర్ ఒడెల్ అక్కడికి వచ్చాడు. అతడు రావడమే ఆలస్యం జనం మొత్తం చుట్టూ మూగారు… మాట మాట కలిపి సెల్ఫీలు దిగారు. కరచాలనం చేయడానికి పోటీపడ్డారు . ఇదంతా చూసి అక్కడ నుంచి కుక్ వెళ్లిపోయాడు. దీనిని కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో అక్కడినుంచి మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
డబ్బుంటే సరిపోదు
ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతటి కుక్ ను అమెరికాలోనే జనం గుర్తించకపోవడాన్ని చాలామంది ఆశ్చర్యకరమైన విషయంగా భావించారు. ఆపిల్ కంపెనీ సీఈవోగా.. వేల కోట్లకు అధిపతిగా.. అంతే సంఖ్యలో ఉద్యోగులకు యజమానిగా ఉన్న కుక్ ను అమెరికన్లు గుర్తించకపోవడం నిజంగా షాక్ కు గురిచేసే విషయమని అభిప్రాయపడ్డారు..”కుక్ ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. ఆయన తన ఆపిల్ కంపెనీ ద్వారా ప్రతి ఏడాది కొత్త మొబైల్ ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి.. అదే స్థాయిలో పరిచయాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని అమెరికాలోనే గుర్తించలేదంటే మామూలు విషయం కాదని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అయితే ఇదే కుక్ కనుక భారతదేశంలో పుట్టి ఉంటే ఒక సెలబ్రిటీకి మించి హోదాను అనుభవించే వాళ్ళని.. భారతదేశంలో డబ్బు ఉన్నవాళ్లంతా ఇలాంటి హోదాను ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. కొందరైతే ముకేశ్ అంబానీ ఇంట్లో గత ఏడాది ఇదే సమయానికి జరిగిన పెళ్లి వేడుకల గురించి ప్రస్తావిస్తున్నారు. ముకేశ్ అంబానీ బయటికి వస్తే ఆయనను చూడడానికి.. కరచాలనం చేయడానికి చాలామంది పోటీ పడుతుంటారని.. కానీ కుక్క పరిస్థితి సొంత దేశంలో ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించరని వ్యాఖ్యానిస్తున్నారు.
యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ న్యూ ఓర్లిన్స్ లో ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అయితే అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. అయితే పక్కనే ఉన్న అమెరికన్ ఫుట్ బాలర్ ఒడెల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు.#Timcook #Apple #Neworlins #America pic.twitter.com/78WVpaNQx8
— Anabothula Bhaskar (@AnabothulaB) February 13, 2025