Ganesh Temple in America:అమెరికాలో కూడా హిందూ మతానికి స్వేచ్ఛ ఉంది. మన దేశంలోలాగే అక్కడ కూడా మన మతానికి మంచి విలువ ఉంది. దీంతో చాలా మంది మన ఆచార వ్యవహారాలు ఆచరించేందుకు ఇష్టపడుతుంటారు. చాలామంది మన భారతీయులు అమెరికా వారిని పెళ్లి చేసుకున్నా మన సంప్రదాయం ప్రకారమే చేసుకోవడం విశేషమే. అంటే వారికి మన మతం పట్ల ఎంత అభిమానం ఉందో ఇట్టే తెలుస్తోంది. కానీ కొన్ని దేశాలు మాత్రం మత చాందసవాదంతో ఇతర మతాలను ద్వేషిస్తున్నా అమెరికన్లు మాత్రం మన మతాన్ని వారి మతంతో సమానంగా చూడటం వారి నైతికతకు నిదర్శనమే.
అమెరికాలోని ఓ వీధికి మన హిందూ పేరును పెట్టడం చూస్తుంటే వారికి కూడా మన ఆచారాలంటే ఇష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్ లోని ఓ విధికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ అని నామకరణం చేసి వారిలోని ఉదారతను చాటుకున్నారు. మహా వల్లభ గణపతి దేవస్థానం వెలుపల ఉన్న వీధికి ఈ ఘనత దక్కడం విశేషం. భారతీయ సంస్కృతికి అరుదైన గౌరవం దక్కడం మామూలు విషయం కాదు. మన సమాజం గర్వపడేలా ఆ వీధికి మన పేరు పెట్టడం చూస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది.
1977లో అక్కడ ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో మహా వల్లభ గణపతి ఆలయాన్ని నిర్మించి మన ఆశలు నెరవేర్చారు. ఉత్తర అమెరికాలోని పురాతన హిందూ దేవాలయంగా ఖ్యాతి చెందింది. ఈ ఆలయంలో మన తెలుగువారు పూజలు చేయడం ఆనవాయితీ. దీంతో దేవాలయానికి విశిష్టత లభించింది.
మరోవైపు న్యూయార్క్ లోని క్వీన్స్ కౌంటీలో ప్లషింగ్ లో ఉన్న ఓ గుడి బయట వీధికి బౌన్ స్ట్రీట్ అనే పేరు పెట్టారు. అమెరికాలో స్వేచ్ఛ కోసం ఉద్యమించిన అమెరికన్ మార్గదర్శకుడు కావడంతో ఆయన పేరును ఆ వీధికి పెట్టడంతో మన వారికి కూడా ఎంతో ఉదారత ఉందని తెలుస్తోంది. మనం అనుసరించే నైతికతను పట్టే మనకు గుర్తింపు వస్తుంది. అమెరికాలో మన వారి ఆచార వ్యవహారాలను చూపిస్తూ ఇతరుల పట్ల కూడా మనం అంతే స్థాయిలో మర్యాదగా వ్యవహరించడం చూస్తుంటే మన వారికి పరమత సహనం ఎంతో ఉందని తెలుస్తోంది.