KGF2 in Greece: గ్రీస్‌ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సౌత్ చిత్రం !

KGF2 in Greece: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రాబోతున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు తన పేరిట సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది. గ్రీస్‌ లో విడుదలయ్యే మొదటి దక్షిణ భారతీయ చిత్రం ఈ సినిమానే కానుంది. […]

Written By: Shiva, Updated On : April 4, 2022 10:20 pm
Follow us on

KGF2 in Greece: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రాబోతున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు తన పేరిట సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది.

KGF2 in Greece

గ్రీస్‌ లో విడుదలయ్యే మొదటి దక్షిణ భారతీయ చిత్రం ఈ సినిమానే కానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ యూకే (UK)లో ఇప్పటికే ప్రారంభమైంది. కాగా కేవలం 12 గంటల్లోనే 5,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఇది భారతీయ సినిమాల్లోనే అత్యధికం కావడం విశేషం. ఇక ఈ చిత్రం యూఎస్ మరియు సౌత్ అమెరికాలో కూడా విడుదల కానుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్‌ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ షాట్స్ అండ్ బిల్డప్ షాట్స్ అదిరిపోయాయి. అందుకే.. ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఎలాగూ మొదటి పార్ట్ బంపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ భారీ అంచనాలకు కారణం ఇదే. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు.

అన్నిటికిమించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Tags