Loud speakers:ప్రతి మనిషి మతంతో కాదు మానవత్వంతో ప్రవర్తించాలి. మన మతం ఎదుటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు. సమాజంలో ఏ వ్యక్తికి కూడా ఇబ్బందులు తీసుకురావద్దు. మతంలోని మంచినే మనం ఆచరించాలి. మంచినే పెంచి పోషించాలి. అప్పుడే మతంపై అందరికి సమ్మతం ఏర్పడుతుంది. దేశంలో ఎన్నో మతాలున్నాయి. ఎందరో మనుషులు తమ ఇష్టానుసారం మతాన్ని ఎంచుకోవచ్చు. అది హిందు, ముస్లిం, క్రైస్టియన్, బౌద్దం, జైన ఏదైనా కావచ్చు. మనిషిలో క్రూరత్వం ఉండకూడదు. ఎదుటి వారిని ఎలాంటి కష్టాలకు గురిచేయకూడదనేది మన రాజ్యాంగంలో పొందుపరచిన చట్టం.
ఇటీవల కాలంలో మతం అందరికి సమ్మతంగా ఉం
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, రోగులు, ఇతరులకు చెవులు చెల్లులు పడేలా లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు చేశారు. దీనిపై గత వారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు వాడకం ఆపాలని డిమాండ్ చేయడంతో వివాదం తలెత్తింది. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపకపోతే హనుమాన్ చాలీసా కూడా ఇదే విధంగా వినిపిస్తామని సవాల్ చేశారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేందుకు కారణమవుతుందని తెలుస్తోంది. ముస్లింలు తమ మసీదుల్లో లౌడ్ స్పీకర్లు కాకుండా చిన్న పాటి సౌండ్ సిస్టమ్ తో వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వ్యవహారంలో ముస్లింలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. సౌండ్ సిస్టమ్ తగ్గిస్తారా? లేక మాకెందుకులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది.