Awadhana Vaibhavam: తానా అవధానం.. ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో..

అవధానాలు 13వ శతాబ్దం నుంచే ఉన్నా, విద్యా మాడభూషి వేంకటాచార్యులు ఆధునిక కాలంలో అవధానానికి ఆద్యులుగా పరిగణిస్తారు. 150 ఏళ్ల క్రితం 1872, ఫిబ్రవరి 22న కృష్ణాజిల్లా ఆరిగిపల్లిలో మొదటి అవదానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : February 28, 2024 11:45 am
Follow us on

Awadhana Vaibhavam: తానా.. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికాగా తెలుగువాళ్లు ఏర్పాటు చేసుకున్న సొసైటీ. వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అమెరికా పిలిపించి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తానా సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెల ఆఖరి ఆదివారం ఆన్‌లైన్‌లో సాహిత్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 25న 65వ సాహిత్య సమావేశం అవధాన వైభవం పేరిట నిర్వహించారు. ‘‘నేటి అవధానుల నోట … నాటి మేటి అవధానుల సాహితీఝరి’’ ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్‌ వృంగవరపు తన తొలి పలుకులతో అందారినీ ఆకట్టుకున్నాడు. ఆహ్లాదపరిచే కళ మన తెలుగు అవధానం అని అలాంటి ప్రక్రియలో విశేష ప్రతిభ కనబరుస్తున్న, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అవధానలందరికీ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకుర మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది అవధానులు, అమెరికాలో ఉన్న మరికొంతమంది అవధానులు ఒకే వేదికపై పాల్గొన్న సమ్మేళనం చరిత్రలో ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిలుస్తుందని తెలిపారు.

13వ శతాబ్దం నుంచే అవధానాలు..
ఇక ఈ అవధానాలు 13వ శతాబ్దం నుంచే ఉన్నా, విద్యా మాడభూషి వేంకటాచార్యులు ఆధునిక కాలంలో అవధానానికి ఆద్యులుగా పరిగణిస్తారు. 150 ఏళ్ల క్రితం 1872, ఫిబ్రవరి 22న కృష్ణాజిల్లా ఆరిగిపల్లిలో మొదటి అవదానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇంతటి విశిష్ట అవధాన కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలపై ఉందని ముఖ్య అతిథి పూర్వపంచ సహస్వ్రాధాన సార్వభౌమ డాక్టర్‌ మేడసాని మోహన్‌ అన్నారు. తెలుగు వారికి మాత్రమే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో ఎందరో అవధానులు అత్యంత ప్రతాభావంతంగా అవధానాలు చేశారని తెలిపారు. కాలక్రమంలో ఈ అవధాన కళ కూడా అనేక మార్పులకు లోనైనా యువ అవధానులను తయారు చేయడం అవధాన వైభవం కోల్పోకుండా భావి తరాలకు ఈ కళను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శతావధాని గాడేపల్లి వీర రాఘవశాస్త్రి అన్నారు.

విశిష్ట అతిథులు ఇలా..
ఈ అవధానవైభంలో విశిష్ట అతిథి మహిళావధాని డాక్టర్‌ బులుపు అపర్ణ–అవధాని శ్రీజంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి సాహితీ వైభవాన్ని, అవధాని డాక్టర్‌ బోచ్కర్‌ ఓం ప్రకాష్‌ జంట అవధానులు.. తిరుపతి వేంకటకవులు(శ్రీదివాకర్త తిరుపతి శాస్త్రి, శ్రీచెళ్లపిల్ల వేంకటశాస్త్రి)గారి వైభవాని ఆముదాల మురళి– అవధాని పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు అవధాన విన్యాసాలను వివరించారు. అవధాని డాక్టర్‌ రాంభట్ల పార్వతీశ్వరశర్మ– జంట అవధానులు వేంకటరామకృష్ణకవులు(శ్రీఓలేటి వేంకటరామశాస్త్రి, శ్రీవేదుల రామకృష్ణశాస్త్రి) అవధాన విన్యాసాలను వినిపించారు. 17 సంవత్సరాల వయస్సులోనే శతావధానం చేసిన ఉప్పలధడియం భరత్‌ శర్మ –శతావధాని డాక్టర్‌ కడప వెంకట సుబ్బన్న పాండిత్య ప్రతిభన అమెరికాదేశపు తొలి అవధాని డాక్టర్‌ పుదూర్‌ జగదీశ్వరన్‌ – కొప్పరపు సోదరకవుల (వేంకటసుబ్బరాయశర్మ, వేంకటరమణశర్మ) ఆశుకవితా పద్యవేగం గురించి, అమెరికా అవధాని నేమాని సోమయాజులు – అవధాని శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు సాహిత్య వైభవాన్ని చక్కగా విశ్లేషించారు.