https://oktelugu.com/

Google Gemini AI: సుందర్‌ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం.. దిగిపోతారా?

గూగుల్‌ ఇటీవల తన చాట్‌బాట్‌ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్‌ చేసింది. గ్లోబల్‌ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు(ఏఐ) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 28, 2024 / 11:53 AM IST

    Google Gemini AI

    Follow us on

    Google Gemini AI: గూగూల్‌ తన బార్డ్‌ చాట్‌బాట్‌ని ఇటీవల జెమనీగా పేరు మార్చింది. అట్టహాసంగా దీనిని ప్రారంభించినా వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంలో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వివాదం కారణంగా సుందర్‌ పిచాయ్‌ తొలగింపు లేదా తప్పుకోవాల్సి రావొచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌ హెలియోస్‌ క్యాపిటల్‌ వ్యవస్థాపకుడు సమీర్‌ ఆరోరా తెలిపారు. ఏఐ చాట్‌బాట్‌ జెమినీ చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్‌ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా అంచనా ప్రకారం ఆయన్ను(సుదర్‌ పిచాయ్‌)ను తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి’ అని తెలిపారు.

    జెమినీ కథేంటి?
    గూగుల్‌ ఇటీవల తన చాట్‌బాట్‌ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్‌ చేసింది. గ్లోబల్‌ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు(ఏఐ) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాల్లో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇపుపడు జిమిని ప్రొ 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్‌ కావొచ్చని టెక్‌ దిగ్గజం తెలిపింది.

    వివాదం ఎందుకు?
    ఈ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ బర్డ్‌ను ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లిం చేసిన గూగుల్‌ కొత్త ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం ఈ ఏఐ టూల్‌ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్‌ కక్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్‌ ఇమేజ్‌ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
    గూగెల్‌ సెర్చ్‌ ఇంజిన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌ రాఘవన్‌ ఒక బ్లాగ్‌ పోస్టులు యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ గురించి ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్ని సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా జెమిని వివాదం గూగుల్‌ సీఈవో మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది.