TS DSC Notification 2024: గత ప్రభుత్వ వైఫల్యాలనే తమ అస్త్రాలుగా మార్చుకుని తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చింది. గత పాలకు చేసిన పొరపాట్లను చేయకుండా తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష తేదీని కూడా ప్రకటించింది. తాజాగా తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ ఆగస్టులో విడుదల చేసిన పోస్టులకు అదనంగా 5973 పోస్టుల కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఆర్థిక శాఖ ఆమోదం..
11,067 ఉపాధ్యాయ పోస్టుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈమేకు జీవో విడుదల చేసింది. జీవో 27 ద్వారా 4957 పోస్టులు, జీవో 27 ద్వారా 1,018 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇక ఏక్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఎస్జీటీ పోస్టులే ఎక్కువ..
తాజా సమాచారం ప్రకారం కొత్త నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. 6,500లకుపైగా సెకండరీ గ్రేడ్ పోస్టులు ఉన్నాయని తెలిసింది. స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) పోస్టులు 2,600 ఉన్నట్లు సమాచారం. భాషా పండిత పోస్టులు 700, పీఈటీ పోస్టులు 190 ఉన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మేనిఫెస్టోలో ప్రకటన..
కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం టీచర్ పోస్టులు పెంచింది. ఈ నేపథ్యంలో 5,973 పోస్టులకు విద్యాశాఖ ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11,62 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.