World Telugu Literature Conference: ప్రపంచంలోని తెలుగు వారిని ఏకం చేయడం.. తెలుగు వారందరినీ ఒక్క చోట చేర్చడం. ప్రముఖులను గౌరవించుకోవడం వంటి కార్యక్రమాలతో ఏటా ప్రపంచ తెలుగు మహా సభలు, ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. నవంబర్ 22, 23 తేదీల్లో రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ఖతార్ రాజధాని దోహా వేదిక కానుంది. 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు మాజీ ఉప రాష్ట్ర ప్రతి పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సమేథంగా హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఖతార్‌లోని భారత దేశ రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. పది ప్రపంచ దేశాల అధ్యక్షులు, భారత దేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాస్ట్రాల మంత్రులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
రామ చంద్రమౌళికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు..
ఇక 9వ తెలుగు సాహిత్య సదర్సులో ప్రముఖ కథకులు, సాహితీవేత్త ప్రొఫెసర్ రామాచంద్రమౌళికి ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతులు సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన 35 మంది ప్రముఖ కవులు స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ సంచాలకులుగా, శ్రీమతి బులుసు అపర్ణ తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంథావిష్కఱతో పాటు 33 గ్రంథాలను ఆవిష్కరిస్తారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సమగ్ర వెబ్‌సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతోపాటు పుస్తక ప్రదర్శన, విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
తొలి రోజు కార్యక్రమాలు..
ఇక ఈ ప్రపంచ సాహితీ పండుగలో భాగంగా మొదటి రోజు నవంబర్ 22న సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్థం విందు భోజనం, ప్రముఖ గాయకులు రామకృష్ణ, లలిత దంపతులు, సుచిత్ర, బాలాంత్రపు రాంప్రసాద్ వారి సంగీత విభావరి ఉంటాయి. దోహాలోని కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
ఆర్థిక సాయం కోసమే..
ప్రతిష్టాత్మకమైన 9వ ప్రంపచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం పద్యాలను ఆర్థిక సహకారం అర్థించనున్నారు. నిర్వాహకులు ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా చూసే అవకాశం ఉంది.