Ayushmann Khurrana: చండీఘర్ లో పుట్టిన ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. విక్కీ డోనర్ సంచలన విజయం నమోదు చేసింది. ఫస్ట్ మూవీతోనే ఆయుష్మాన్ ఖురానా పరిశ్రమను ఆకర్షించాడు. అనంతరం 2015లో విడుదలైన దమ్ లాగాకే హైసా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా కి జంటగా భూమి పెడ్నేకర్ నటించింది.
అంధాదున్ మూవీ ఆయుష్మాన్ ఖురానాకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆయన గుడ్డివాడి పాత్ర చేశాడు. కళ్లుండి గుడ్డివాడిగా నటించే పాత్రలో మెప్పించాడు. డార్క్ కామెడీ, క్రైమ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. విలక్షణమైన సబ్జెక్ట్స్ తో సూపర్ హిట్స్ కొడుతూ ఆయుష్మాన్ ఖురానా నిర్మాతల ఫేవరేట్ హీరో అయ్యారు. ఆయన నటించిన మీడియా బడ్జెట్ చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. సబ్జెక్టు నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా ఆయుష్మాన్ ఖురానా సిద్ధంగా ఉంటారు.
ఆయుష్మాన్ ఖురానా ప్రొఫెషనల్ సింగర్ కూడా పలు చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. ఆయుష్మాన్ ఖురానా సినిమాల్లోకి రాకముందే వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు తాహిరా కశ్యప్. 2018లో ఆయుష్మాన్-తాహిరా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. తాజాగా ఆయన ఓ పాడ్ క్యాస్ట్ లో ఫ్యామిలీ మేటర్స్ పంచుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో ఆయుష్మాన్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారట. తన తండ్రితో పోల్చితే నేను భిన్నమైన ఫాదర్ ని అని ఆయన అన్నారు.
అందుకు కారణం… ఆయుష్మాన్ తండ్రి తన పట్ల ఒక నియంతలా వ్యవహరించేవాడట. బాల్యంలో తండ్రి వేధింపులకు గురయ్యాడట. ఆయుష్మాన్ ని వాళ్ళ నాన్న చెప్పుతో, బెల్టుతో కొట్టేవాడట. ఒకసారి తాను సిగరెట్ తాగపోయినా కూడా షర్ట్ వాసన రావడంతో బాగా కొట్టారట. చిన్నప్పుడు తండ్రి చేతిలో తిన్న దెబ్బలను ఆయుష్మాన్ ఖురానా గుర్తు చేసుకున్నారు. తండ్రిపై ఆయుష్మాన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం ఆయుష్మాన్ రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో ఓ చిత్రం తమ టైటిల్ తో తెరకెక్కుతుంది. మరో అన్ టైటిల్డ్ మూవీ ఆయన ఖాతాలో ఉన్నాయి. తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.