Women’s ODI World Cup Full Schedule: సోమవారం ఐసీసీ కీలక షెడ్యూల్ విడుదల చేసింది. మహిళల వన్డే విశ్వ సమరానికి సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ నిర్వహిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంకలో సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్నాయి.. రౌండ్ రాబిన్ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారు.. టోర్నీ ప్రారంభం రోజు భారత జట్టు బెంగళూరులో శ్రీలంకతో పోటీ పడుతుంది.. భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో అక్టోబర్ ఐదు న తలపడుతుంది.. అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో ఈ మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. తటస్థ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల పాక్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ భారత్ తటస్థ వేదికగా మ్యాచులు ఆడింది. ఇప్పుడు మహిళల వన్డే వరల్డ్ కప్ లోను పాకిస్తాన్ అదే విధానాన్ని అనుసరిస్తున్నది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్ – పాకిస్తాన్ తలపడతాయి. పేటివల్ ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలో ఏకంగా 11 లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. దీనికి ఐసిసి పాలక పక్షం కూడా ఆమోదం తెలిపింది..
డిపెండింగ్ ఛాంపియన్ గా కంగారు జట్టు
వరల్డ్ కప్ లో కంగారు జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా ఆ రంగంలోకి దిగనుంది. ఇక శ్రీలంక – భారత్ టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 30న లంక, భారత్ పోటీ పడతాయి. ఈ మ్యాచ్ ద్వారా మెగా పోరు మొదలవుతుంది. అక్టోబర్ 1న కివీస్, కంగారు జట్లు తలపడతాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 11 లీగ్ మ్యాచ్లను కొలంబో వేదికగా నిర్వహిస్తారు.. అక్టోబర్ 29న కొలంబో లేదా బెంగళూరులో తొలి సెమీఫైనల్ నిర్వహిస్తారు. అక్టోబర్ 30న బెంగళూరు వేదికగానే రెండవ సెమీఫైనల్ నిర్వహిస్తారు. ఇక ఫైనల్ పోరు నవంబర్ 2న జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కొలంబో లేదా బెంగళూరులో నిర్వహిస్తామని ఐసిసి ప్రకటించింది. అయితే తుదివేదిక ఇంకా ఖరారు కాలేదు.
ప్లేయర్లలో ఉత్సాహం
విశ్వ సమరం నేపథ్యంలో భారత ప్లేయర్లు సమరోత్సాహంతో ఉన్నారు. ఇటీవల కాలంలో భారత్ వరుస విజయాలతో జోరు మీద కనిపిస్తోంది. అన్ని ఫార్మాట్లలో అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో వన్డే సమరంలోను సత్తా చూపిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పైగా స్వదేశంలో మెగా టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా భారత్ అంచనాలు అందుకుంటుందని.. ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముందస్తుగానే భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు. స్వదేశంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరుతున్నారు.
The countdown begins ⏳
The full schedule for the ICC Women’s Cricket World Cup 2025 is out
Full details ➡ https://t.co/lPlTaGmtat pic.twitter.com/JOsl2lQYpy
— ICC (@ICC) June 16, 2025