Rajinikanth With Kannappa Team: మోహన్ బాబు(Manchu Mohan Babu) కి అత్యంత ఆత్మీయులలో ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth). ఒకరిని ఒకరు ‘ఏరా’ అని పిలుచుకునేంత చనువు ఉంది. మోహన్ బాబు ఏ చిన్న సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉంటాడు రజనీకాంత్. గతం లో మోహన్ బాబు హీరో గా నటించిన ‘పెద్దరాయుడు’ చిత్రం లో రజనీకాంత్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్పెషల్ రోల్ చేసాడు. ఆ స్పెషల్ రోల్ అప్పట్లో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. అదే విధంగా మోహన్ బాబు కోసం ప్రత్యేకంగా ‘రాయలసీమ రామన్న చౌదరీ’ స్టోరీని సిద్ధం చేసి ఇచ్చాడు రజనీకాంత్. దీని కోసం కూడా ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ మధ్య మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే మంచు కుటుంబం తో ఇంతటి ఆత్మీయత ఉన్నప్పటికీ ఎందుకు రజనీకాంత్ ‘కన్నప్ప'(Kannappa Movie) లో నటించలేదని రీసెంట్ గా మంచు విష్ణు(Manchu Vishnu) ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతాడు.
దానికి ఆయన సమాధానం చెప్తూ ‘రజనీకాంత్ గారి కోసం ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ రాసుకున్నాము. నాన్నగారి కాంబినేషన్ లో ఆ సన్నివేశం ఉంటుంది. కానీ ఎందుకో ఆ సన్నివేశం కథకి అడ్డం గా ఉంటుంది అనిపించింది. అందుకే వద్దు అనుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా మోహన్ బాబు, విష్ణు కలిసి నిన్న చెన్నై కి వెళ్లి సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిశారు. అక్కడికి వెళ్లిన తర్వాత రజనీకాంత్ కి కన్నప్ప మూవీ స్పెషల్ షో వేసి చూపించారట. సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ రియాక్షన్ ని మంచు విష్ణు సోషల్ మీడియా లో నెటిజెన్స్ తో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాత్రి రజనీకాంత్ అంకుల్ కన్నప్ప చిత్రాన్ని చూసి నన్ను గట్టిగా హత్తుకొని, చాలా అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు’.
Also Read: Kannappa trailer : కన్నప్ప ట్రైలర్ చూశాక సినిమా అంచనాలు అందుకుందా? లేదా?
’22 ఏళ్ళ నుండి నేను ఇండస్ట్రీ లో ఉన్నాను. ఒక నటుడిగా ఆయన నుండి ఇలాంటి హగ్ కోసం 22 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆయన నాకు ఇచ్చిన ఈ ప్రశంసలు నాకు సినిమా విజయం పై మరింత నమ్మకాన్ని చేకూర్చింది. ఈ నెల 27 న ఈ చిత్రం మీ ముందుకు రాబోతుంది. మీ నుండి కూడా ఇలాంటి రియాక్షన్స్ వస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మొన్న విడుదల చేసిన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ లో ట్రైలర్ ఉంటుందని ఊహించలేదంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మంచు విష్ణు ఎదురు చూస్తున్న భారీ విజయం ఆయన చేతుల్లో పడినట్టే అనుకోవచ్చు.