HomeNewsLaila Movie Twitter Review: వ్యతిరేకత మధ్య విడుదలైన విశ్వక్ సేన్ మూవీ హిట్టా ఫట్టా?...

Laila Movie Twitter Review: వ్యతిరేకత మధ్య విడుదలైన విశ్వక్ సేన్ మూవీ హిట్టా ఫట్టా? ఆడియన్స్ తేల్చేశారు!

Laila Movie Twitter Review: విశ్వక్ సేన్ మూవీ విడుదల అంటే.. ఏదో ఒక వివాదం తెరపైకి రావాల్సిందే. తాజా లైలా మూవీ విషయంలో కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయ్యింది. లైలా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్స్… మాజీ సీఎం వైఎస్ జగన్ అభిమానులను హర్ట్ చేశాయి. వారు బాయ్ కాట్ లైలా నినాదం అందుకున్నారు. లైలా మూవీ హెడ్ డీ ప్రింట్ నెట్ లో వదులుతామని బెదిరింపులకు దిగారు.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పృథ్విరాజ్ చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదం విశ్వక్ సేన్ మూవీకి మేలే చేసింది. పెద్ద ఎత్తున ఫ్రీ పబ్లిసిటీ దక్కిందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ వివాదం అల ఉండగా… లైలా మూవీ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదల చేశారు. ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది.

విశ్వక్ సేన్ లైలా మూవీలో రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించాడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్.. లేడీ గెటప్స్ లో పూర్తి స్థాయి రోల్స్ చేసి ట్రెండ్ సెట్ చేశారు. ఆ సాహసం మరలా విశ్వక్ సేన్ చేశాడు. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది.

లైలా మూవీకి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఆడియన్స్ మూవీ బాగుందని పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇదో చెత్త సినిమా అంటూ కొట్టి పారేస్తున్నారు. లేడీ గెటప్ లో విశ్వక్ నటన బాగుంది. కామెడీ సైతం వర్క్ అవుట్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. లైలా మూవీ చూడదగ్గ చిత్రం అంటూ కొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆడియన్స్ లైలా మూవీ పూర్తిగా నిరాశ పరిచింది అంటున్నారు. డబుల్ మీనింగ్స్ తో కూడిన, అడల్ట్ కామెడీ విసుగు పుట్టించింది. హాస్యం పండలేదు. అసలు బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క సన్నివేశం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో లైలా మూవీ అసలైన ఫలితం తెలియాలంటే.. పూర్తి రివ్యూ రావాల్సిందే.

RELATED ARTICLES

Most Popular