Lavanya : గత ఏడాది హీరో రాజ్ తరుణ్(Raj Tarun) పై లావణ్య(Lawanya) అనే అమ్మాయి చేసిన సంచలన ఆరోపణలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజ్ తరుణ్ కి ఆయన కుటుంబానికి ఈమె నిద్ర లేకుండా చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు ఫైల్ చేసినప్పుడు రాజ్ తరుణ్ పై సోషల్ మీడియా లో చాలా నెగటివిటీ ఏర్పడింది. అమాయకురాలిని మోసం చేస్తావా అంటూ రాజ్ తరుణ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత నిజానిజాలు తెలుసుకున్నాక రాజ్ తరుణ్ పై సానుభూతి పెరిగింది. ఎప్పుడో బ్రేకప్ అయిపోయి తన జీవితాన్ని తాను చూసుకున్న రాజ్ తరుణ్ ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడానికి లావణ్య ఇంత చేసిందని, ఆయన నుండి డబ్బులు రావడం ఆగిపోయినప్పటి నుండి ఇలా ఆమె రివర్స్ అయ్యిందని తేలింది. ఎప్పుడైతే శేఖర్ బాషా వీళ్ళ మధ్య ఎంటర్ అయ్యాడో, అప్పటి నుండే లావణ్య బండారం మొత్తం బయటపడింది.
ఇక జనాలకు కూడా రాజ్ తరుణ్ తప్పేమి లేదని తెలియడంతో లావణ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ముంబై లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా(malvi malhotra) కలిసి ఉంటున్న రూమ్ కి వెళ్లి పెద్ద రచ్చ చేసి, మళ్ళీ ఎదో ఒక విధంగా రాజ్ తరుణ్ ని లొంగదీసుకోవాలని చూసింది, కానీ ఆ చర్యకు ఎలాంటి మైలేజ్ రాకపోవడంతో మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ మస్తాన్ సాయి(Mastan Sai) చేసే అక్రమాల గురించి పోరాడుతూ మీడియా ముందుకు వచ్చాయి. ఎంతో మంది అమ్మాయిలను అతను మోసం చేసాడని, వాళ్లకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ మొత్తం ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నాయంటూ పోలీసులకు సబ్మిట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాజ్ తరుణ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆమె మాట్లాడుతూ ‘రాజ్ తరుణ్ ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. అతనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. అవసరమైతే అతని కాళ్ళు కూడా పట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. మీరు అతన్ని మీడియా ముందుకు లాగి అంత ఇబ్బంది పెట్టారు కదా, ఇప్పుడు ఆయన మిమ్మల్ని క్షమించి మళ్ళీ మీతో ఉంటారని ఆశిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు లావణ్య సమాధానం చెప్తూ ‘నేను అంత దూరం ఆలోచించలేదండీ..అతనికి నామీద కోపం ఇప్పుడు ఉండొచ్చు. సంవత్సరం తర్వాత అయినా, లేదా పది సంవత్సరాల తర్వాత అయినా నన్ను క్షమిస్తాడని నమ్మకం ఉంది. ఎప్పటికీ అతను నా రాజ్ యే’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కానీ నెటిజెన్స్ మాత్రం ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు. నీ లాంటి అమ్మాయిల వాళ్ళ నిజంగా అన్యాయం జరిగిన అమ్మాయిలను జనాలు నమ్మే పరిస్థితి రావడం లేదంటూ తిడుతున్నారు.