‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై శుక్రవారం పూర్వా పాల్గొని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శుక్రుడి సంచారం వలన కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం .
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : సమాజంలో గౌరవం పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా ఆనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) బంధువులో ఒకరి నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. నిరుద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పనులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే తీవ్రంగా కృషి చేయాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టేముందు బాగా ఆలోచించాలి. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. పిల్లల కోసం కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది భవిష్యత్తులో రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అయితే కొందరి భాగస్వాముల సహకారంతో ముందుకు వెళ్తారు. బంధువుల్లో ఒకరి ఇంట్లో శుభకార్యానికి హాజరవుతారు. ఉద్యోగులను కొందరు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ జీవిత భాగస్వామి సహకారంతో వారిపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆస్తి కొనుగోలు విషయంలో శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల సమయం. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : గతంలో ఉన్న వివాదాలు నేటితో సమసిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. కొందరు శత్రువులు వీరిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. కానీ దైవం తోడు ఉండడంతో వీరికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈరోజు కొన్ని అదనంగా ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇష్టం లేని కొన్ని పనులు చేయకుండా ఉండడమే మంచిది
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఊహించని లాభాలతో ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం అవుతుంది. బంధువుల్లో ఒకరు దర సహాయం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : గతంలో ఉన్న వివాదాలు నేటితో పరిష్కారం అవుతాయి. ఏదేని కీలక నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు సలహా అవసరం. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేపట్టిన కొత్త పనులు భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అది సమస్యగా మారుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారికి ఈరోజు ప్రతికూల వాతావరణ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. వ్యాపారులో జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తే సక్సెస్ సాధిస్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి తో వివాదాలు ఉంటాయి. అయితే పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది.