Victory Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా యూనిట్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో ఫుల్ జోష్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకటేష్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలతో పాటు వెంకటేష్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా బాలయ్యతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ తన జీవితంలో తాను బాగా డిస్టర్బ్ అయ్యాను అని ఆ సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఏం జరిగిందో పలు విషయాలను తెలిపారు. ఆలయం వెళ్లిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఈ షోలో తెలిపారు. నేను ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను అలాగే ఈ క్రమంలో చాలామందిని కలిశాను. నా జీవితంలో బాగా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత ఫైనల్లీ అరుణాచలం ఆలయం వెళ్లి స్వామి దర్శనం చేసిన తర్వాత స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ మనలో ఏదో తెలియని శక్తి ప్రవేశిస్తుంది అసలైన హ్యూమన్ ఎనర్జీ అంటే ఏంటో అక్కడే తెలుస్తుంది అని వెంకటేష్ తెలిపారు. అలాంటి శక్తిని నేను అక్కడే పొందాను ఇక ఆ తర్వాత నుంచి నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేకపోయింది అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న నాలో ఉన్న ఈ మార్పులు అరుణాచలం స్వామిని దర్శించిన తర్వాత వచ్చినవే.
ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రశాంతత అక్కడ దొరుకుతుంది. అలాగే అక్కడ నేను అన్నది మర్చిపోయి ఏది శాశ్వతము కాదని అందరూ తెలుసుకుంటాము అని వెంకటేష్ భక్తితో ఎమోషనల్ గా చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అరుణాచలం ఆలయం తమిళనాడు రాష్ట్రంలోనే తిరువన్నామలై జిల్లాలో పచ్చని కొండ పక్కన ఉంది. తమ జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్లు అరుణాచల ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. ఈ పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది అని చాలామంది భక్తులు విశ్వసిస్తుంటారు.
శివుడు అగ్ని లింగంగా అక్కడ అవతరించాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగా మరియు పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగా అరుణాచల ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పరమశివుని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే భక్తి లభిస్తుందని చాలామంది భక్తులు నమ్మకంతో అక్కడికి వెళుతుంటారు.
ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఇలా వెంకటేష్ తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటనల గురించి అలాగే తానూ అరుణాచల ఆలయం దర్శించిన తర్వాత వచ్చిన అనుభూతి గురించి బాలయ్య టాక్ షో లో పంచుకున్నారు.