Visakhapatnam: సాధారణంగా ప్రభుత్వ పాఠశాల( government school) అంటే ఓ పదిమంది వరకు ఉపాధ్యాయులు ఉండడం చూస్తుంటాం. వందల విద్యార్థులు ఉండడం సర్వసాధారణం కూడా. కానీ ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉండగా.. ఉపాధ్యాయుల సంఖ్య వందల్లో ఉండడం విశేషం. అంతలా అక్కడ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఉంది. చుట్టుపక్కల వారు అక్కడ చేర్పించేందుకు పోటీ పడతారు. పోనీ అదేదో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరబడినట్టే. మహానగరంలో ఓ ప్రభుత్వ పాఠశాల అంతలా గుర్తింపు సాధించింది. ఇంతకీ ఎక్కడంటే మహా విశాఖ నగరంలో..
Also Read: కోర్టుకే మస్కా.. బోరుగడ్డ గ్రేట్ ఎస్కేప్
* మూడో వంతు మహిళా ఉపాధ్యాయులే..
గ్రేటర్ విశాఖపట్నం ( greater Visakhapatnam ) పరిధిలోని కొమ్మాది ప్రాంతంలో.. చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఇక్కడ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 3324 మంది విద్యార్థులు చదువుతున్నారు. 117 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం 106 మంది మాత్రమే ఉన్నారు. అయితే అందులో మూడో వంతు అంటే 71 మంది మహిళా ఉపాధ్యాయులే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* కార్పొరేట్ తరహాలో..
ఈ పాఠశాలలో అన్ని ప్రత్యేకతలే. కార్పొరేట్( corporate) తరహాలో ఉంటాయి ఇక్కడ తరగతి గదులు. ఇక్కడ అడ్మిషన్ పొందేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఇక్కడ పనిచేసేందుకు ఉపాధ్యాయులు కూడా పోటీ పడుతుంటారు. బదిలీల సమయంలో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. పైగా నగర ప్రాంతం కావడంతో పని చేసేందుకు ఉపాధ్యాయులు కూడా ముందుకు వస్తుంటారు. ఇక్కడ పోస్టింగ్ కోసం చాలామంది ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధుల చుట్టూ సిఫార్సులకు తిరుగుతుంటారు.
* అన్నీ ప్రత్యేకతలే..
మధురవాడ తో( Madhurawada ) పాటు శివారు ప్రాంతాల్లో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. అందుకే ఈ పాఠశాలలో ఎక్కువమంది తమ పిల్లలను చేర్పిస్తుంటారు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా స్టాఫ్ రూమ్ ఉంటుంది. స్టాఫ్ అంతా అసోసియేషన్ పెట్టుకున్నారు. సమన్వయంతో అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారు.
Also Read: వారి రాజీనామాలకు ఆరు నెలలు.. వైసిపి వ్యూహం.. గాల్లో ఎమ్మెల్సీలు!