Akhil movie : అక్కినేని నాగార్జున హీరోలుగా తన కుమారులను నిలబెట్టాలని తపన పడుతున్నాడు. నాగ చైతన్య పర్లేదు. టైర్ టు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్లాప్స్ తో ఇబ్బందిపడిన నాగ చైతన్యకు తండేల్ బ్రేక్ ఇచ్చింది. అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. అఖిల్ హీరోగా అరంగేట్రం చేసి దాదాపు పదేళ్లు అవుతుంది. 2015లో దర్శకుడు వివి వినాయక్ తో అఖిల్ మూవీ చేశాడు. భారీ బడ్జెట్ తో నిర్మించిన అఖిల్ ఫలితం ఇవ్వలేదు.
హలో, మిస్టర్ మజ్ను వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశాడు. అవి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో మొదటి విజయం అందుకున్నాడు. ఆ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏజెంట్ మూవీ చేసి కెరీర్ ని ప్రమాదంలో పడేసుకున్నాడు. హడావుడిగా తీసి విడుదల చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ విడుదలై రెండేళ్లు అవుతున్నా అఖిల్ నుండి మరో చిత్రం రాలేదు.
Also Read : ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ కి మోక్షం..ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో అఖిల్ మూవీ సెట్ చేశాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు పూరి జగన్నాధ్. శివమణి, సూపర్ చిత్రాలు నాగార్జున-పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చాయి. శివమణి విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో నాగార్జున చెప్పిన ‘నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్’ అనే డైలాగ్ బాగా ఫేమస్. ఇక బాలీవుడ్ మూవీ ధూమ్ ని తలపించేలా సూపర్ తెరకెక్కించారు. ఈ మూవీలో నాగార్జున లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. సూపర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓ మోస్తరు విజయం అందుకుంది.
అఖిల్ కోసం పూరి జగన్నాధ్ కథ రాశాడని, అది నాగార్జునకు నచ్చిందని, మూవీ సెట్ అయ్యిందని అంటున్నారు. అయితే పూరి జగన్నాధ్ ఫార్మ్ లో లేడు. వరుస ప్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో ఒక హిట్ కొట్టాడు. కానీ మళ్ళీ ప్లాప్స్ పడుతున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో అఖిల్ కి పూరి జగన్నాధ్ హిట్ ఇవ్వగలడా? అనే సందేహాలు కాలుతున్నాయి.
Also Read :కింగ్ స్టన్ ఫుల్ మూవీ రివ్యూ…