Yashmi Gowda Marriage: కన్నడ సీరియల్ నటి యష్మి గౌడ బిగ్ బాస్ షో వేదికగా పాపులారిటీ రాబట్టింది. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో యష్మి నటించింది. ఇదే సీరియల్ లో లీడ్ రోల్ చేసిన ప్రేరణ సైతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేసింది. యష్మి స్ట్రాంగ్ ప్లేయర్ గా హౌస్లో సత్తా చాటింది. టాస్క్ లలో గెలిచేందుకు ఆమె శ్రమించేది. అయితే యష్మి గ్రూప్ గేమ్ ఆడిందనే విమర్శలు ఉన్నాయి. స్టార్ మా సీరియల్స్ లో నటించే కన్నడ బ్యాచ్ అయిన పృథ్వి, నిఖిల్, ప్రేరణ, యష్మి ఒక జట్టుగా ఉండేవారు.
Also Read: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!
నిఖిల్ కి యష్మి అట్రాక్ట్ అయ్యింది. మొదట్లో నిఖిల్ సోనియాతో ఉండేవాడు. ఆమె చుట్టే తిరిగేవాడు. సోనియా ఎలిమినేట్ అయ్యాక.. నిఖిల్ దృష్టి యష్మి మీదకు మళ్లింది. అప్పుడప్పుడు హగ్గులు ఇచ్చేవాడు. ఆమెను గారాబం చేసేవాడు. ఇవన్నీ యష్మి ఎంజాయ్ చేసేది. అయితే యష్మి తన చుట్టూ తిరుగుతుందన్నట్లు నిఖిల్ చేసిన కామెంట్స్ యష్మికి కోపం తప్పించాయి. నా క్యారెక్టర్ ని నిఖిల్ డామేజ్ చేశాడని యష్మి కన్నీరు పెట్టుకుంది.
ఈ గొడవలో యష్మినే నష్టపోయింది. ఫైనల్ కి వెళుతుంది అనుకున్న యష్మి 12వ వారం ఎలిమినేట్ అయ్యింది. నిఖిల్ గేమ్ కి యష్మి బలి అయ్యిందని నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ వాపోయారు. గౌతమ్ కృష్ణ సైతం యష్మికి లైన్ వేశాడు. కానీ వర్క్ అవుట్ కాలేదు. నిఖిల్, గౌతమ్ టైటిల్ కోసం పోటీపడ్డారు. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయ్యాడు. కాగా యష్మి పెళ్లి పీటలు ఎక్కుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన పెళ్లి వేడుకలో మంగళ స్నానం చేస్తున్న యష్మి వీడియో బయటకు వచ్చింది. దానితో సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? అసలు యష్మికి కాబోయే భర్త ఎవరని? అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ వీడియో షూటింగ్ లో భాగం అంటున్నారు. ఏదో సీరియల్ లేదా ప్రోగ్రాం కొరకు చేసిన వీడియో అట. నిజంగా యష్మి వివాహం చేసుకోవడం లేదని తెలుస్తుంది. ఇక యష్మి తెలుగులో ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు. అప్పుడప్పుడు టెలివిజన్ షోలలో సందడి చేస్తుంది.
Also Read: సమంత క్రేజీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో మీర్జాపూర్ నటుడు… అంచనాలు పెంచేసిన అలీ ఫజల్ కామెంట్స్