Vivo V50e 5G
Vivo V50e 5G : భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo V50e 5G విడుదలైంది. ఎట్రాక్టివ్ డిజైన్‌తో విడుదలైన ఈ వివో మొబైల్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్లో AI ఫీచర్లు, మెరుగైన వీక్షణ అనుభవం కోసం క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ షాట్‌లు, స్నేహితులతో సెల్ఫీల కోసం అద్భుతమైన ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP68, IP69 అంటే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌లు, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్‌లతో వస్తుంది. ఈ కొత్త వివో ఫోన్ ధర ఎంత, మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, ఈ ఫోన్ తో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి తెలుసుకుందాం.
Also Read : నవంబర్ 19మార్కెట్లోకి రాబోతున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఏంటో తెలిస్తే షాకే
Vivo V50e 5G స్పెసిఫికేషన్‌లు
* డిస్‌ప్లే: ఈ వివో మొబైల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అందిస్తోంది. ఈ ఫోన్ మీకు HDR 10 ప్లస్ సపోర్ట్‌తో లభిస్తుంది.
* ప్రాసెసర్: స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇచ్చారు.
* కెమెరా సెటప్: ఈ ఫోన్‌లో ఫ్రంట్, రియర్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్ కెమెరా యాప్‌లో ఫిల్మ్ కెమెరా మోడ్ అందిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్‌తో అందించబడింది.
* బ్యాటరీ కెపాసిటీ : 5600 mAh బ్యాటరీ ఫోన్‌కు పవర్ అందిస్తోంది. ఇది 90 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
Vivo V50e 5G ధర
ఈ తాజా వివో ఫోన్ 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999. ఈ హ్యాండ్‌సెట్ 8GB RAM/256GB స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ రూ. 30,999లుగా కంపెనీ నిర్ణయించింది.ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 17 నుండి కంపెనీ అధికారిక సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి.
ఈ ధర పరిధిలో, వివో వి50ఇ రియల్‌మీ 14 ప్రో ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్, నథింగ్ ఫోన్ 3ఎ ప్రో, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుంది. రియల్‌మీ ఫోన్ 8GB/128GB వేరియంట్ ధర రూ. 29,999, నథింగ్ ఫోన్ 8GB/128GB వేరియంట్ ధర కూడా రూ. 29,999. మోటరోలా ఫోన్ 12GB/256GB వేరియంట్ కూడా రూ. 29,999కి లభిస్తుంది.
Also Read : కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివా.. ఫీచర్లు విన్నారంటే దిమ్మతిరిగిపోవాల్సిందే
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Vivo v50e 5g 50mp selfie camera ai features
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com