PBKS Vs RCB IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా చాహల్ కొనసాగుతున్నాడు అంటే దానికి ప్రధాన కారణం అదే. వైవిధ్యంగా బౌలింగ్ ఉంటుంది. వికెట్లు కూడా అలాగే తీయగల నేర్పు అతనికి ఉంటుంది. అందువల్లే అతడు అత్యంత మాయాజాల స్పిన్ బౌలర్ గా పేరు పొందాడు.. ఇక తన భార్య ధనశ్రీ తో విడాకుల తర్వాత చాహల్ డిప్రెషన్ లోకి వెళ్లి ఉంటాడని.. ఈ ఐపీఎల్లో అంతగా సత్తా చూపించలేడని.. అతడు బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే చాలా సమయం పడుతుందని.. విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ వాటన్నింటినీ కూడా చాహల్ పక్కన పెట్టాడు. ధనశ్రీ ఎఫెక్ట్ నుంచి త్వరగా నే కోలుకున్నాడు. అంతేకాదు తనకు మాత్రమే సాధ్యమయ్యే స్థాయిలో బౌలింగ్ వేసి.. బుధవారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా ఐపిఎల్ చరిత్రలో అరుదైన బౌలర్గా అతడు ఆవిర్భవించాడు.
Also Read: మాక్స్ వెల్ తప్పుకున్నాడా? తప్పించారా?
మూడు వికెట్లు పడగొట్టాడు
పంజాబ్ – చెన్నై జట్లు తలపడిన ఈ మ్యాచ్లో చాహల్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా ఓకే ఓవర్ లో హ్యాట్రిక్ తో పాటు.. మరో వికెట్ పడగొట్టి.. నాలుగు వికెట్లు సొంతం చేసుకున్న బౌలర్ గా చాహల్ నిలిచాడు. దీంతో చెన్నై జట్టు పూర్తిగా 20 ఓవర్లు ఆడలేకపోయింది. 191 పరుగులకు కుప్ప కూలింది. చెన్నై ఇన్నింగ్స్ 19 ఓవర్లో చాహల్ ఈ అద్భుతం సృష్టించాడు. ఈ ఓవర్ లో రెండవ బంతికి ధోనిని అవుట్ చేసిన చాహల్.. నాలుగో బంతికి హుడా ను అవుట్ చేసాడు. ఐదో బంతికి అన్షుల్ కాంబోజ్ ను వెనక్కి పంపించాడు. ఆరో బంతికి నూర్ అహ్మద్ ను అవుట్ చేశాడు. దీంతో 191 పరుగుల వద్ద చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. ఒకానొక దశలో చెన్నై జట్టు అవలీలగా 200 స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చాహల్ మాయాజాలం ప్రదర్శించడంతో చెన్నై జట్టు 191 పరుల వద్ద ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో మొదటి ఐదు మ్యాచ్లలో 15 ఓవర్లు వేసి చాహల్ 2 వికెట్లు తీశాడు. ఇక తర్వాతే నాలుగు మ్యాచ్లలో 14 ఓవర్లు వేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా సాధించిన హ్యాట్రిక్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగు కంటే ఎక్కువ వికెట్లను 9 సార్లు తీసి చాహల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో సునీల్ నరైన్ 8 సార్లు ఆ ఘనత సాధించి రెండవ స్థానంలో ఉన్నాడు. లసిత్ మలింగ ఏడుసార్లు ఆ రికార్డు సృష్టించి మూడవ స్థానంలో ఉన్నాడు. కగీసో రబాడ ఆరుసార్లు ఆ ఘనతను అందుకొని నాలుగో స్థానంలో ఉన్నాడు.
IPL HATTRICK BY YUZI CHAHAL.
– One of the finest of this league. pic.twitter.com/X4zPBanVyp
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2025
Also Read: రింకూ సింగ్ ను లాగిపెట్టి కొట్టిన కులదీప్ యాదవ్..వైరల్ వీడియో