OG Movie Heroine: టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ బజ్ ని ఏర్పాటు చేసుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు, ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. టీనేజ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ లోకి 28 ఏళ్ళ వయస్సు లో అడుగుపెట్టాడు కాబట్టి. ‘ఓజీ’ చిత్రం లో చాలా సన్నివేశాల్లో డీ ఏజినింగ్ టెక్నాలజీ తో పవన్ కళ్యాణ్ ని టీనేజ్ లుక్ లో చూపించబోతున్నారు. ఇది చాలా అద్భుతంగా వచ్చిందని టాక్. అంతే కాదు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ షర్ట్ లేకుండా కూడా కనిపిస్తాడు. ఎప్పుడో తమ్ముడు సినిమాలో ఆయన్ని మనం షర్ట్ లేకుండా చూశాము, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చూడబోతున్నాము.
Also Read: ప్యారడైజ్ సినిమాలో నాని చనిపోతాడా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంఘటన తెలిసింది. ఈ చిత్రం లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇందులో ఈమె డాక్టర్ గా నటించినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఈమె క్యారక్టర్ ఫస్ట్ హాఫ్ లోనే చనిపోతుంది అనే టాక్ కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో నడుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఒకవేళ నిజంగా ఉంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రతీ పది నిమిషాలకు ఒక ఎలివేషన్ సన్నివేశం ఉంటుందట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఒక సన్నివేశానికి ఇండియా మొత్తం షేక్ అవుతుందని అంటున్నారు. ఆ రేంజ్ లో తెరకెక్కించాడట డైరెక్టర్ సుజిత్.
Also Read: ఆ సెంటర్ లో పవన్,మహేష్ రీ రిలీజ్ సినిమాల గ్రాస్ ని కూడా దాటలేకపోయిన ‘వార్ 2’!
సుజిత్ ఈ సినిమాకు ఎలా పని చేశాడంటే, ఇదే నా జీవితం అనేంత ఎఫర్ట్ పెట్టి పని చేశాడట. అనేక సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడని రేంజ్ లో వచ్చాయట. ముఖ్యంగా క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుందని, ఫ్యాన్స్ థియేటర్ లో దానిని చూసి ఏమైపోతారో అని అంటున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తమ అభిమాన హీరో నుండి యావరేజ్ కంటెంట్ సినిమా వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే కంటెంట్ ఇస్తే అసలు బ్రతుకుతారా?, సినిమా ఆద్యంతం అలాగే ఉంటుందని టాక్. ఈ ఒక్క చిత్రం తో డైరెక్టర్ సుజిత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ డైరెక్టర్స్ గా చలామణి అవుతున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగ, సుకుమార్ వంటి డైరెక్టర్ జాబితాలో చూడొచ్చు.