OG Vs Omi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటులలో ఎన్టీఆర్ – నాగేశ్వరరావు మొదటి స్థానంలో ఉంటారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో వాళ్ళు చాలా వరకు కృషి చేశారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరీ తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వచ్చి మన ఇండస్ట్రీ ని హైదరాబాద్ కి తీసుకొచ్చిన ఘనత కూడా వీళ్ళకే దక్కుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ తర్వాత కృష్ణ,శోభన్ బాబు లాంటి నటులు కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీళ్ళ తరం ముగిసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ గా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఈయన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులను మైమరపింపజేసే సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సూపర్ సక్సెస్ ని సాధించిన వాడవుతాడు. అలాగే తన అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ నుంచి భారీ కంబ్యాక్ నైతే కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కంబ్యాక్ మూవీ ఇదే అవుతుందని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఓజీ సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది.
ఇందులో ఓజీ లో ఓజస్ గంభీరా పవన్ కళ్యాణ్ కనిపిస్తే, ఓమి గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య గొడవ ఎలా జరుగుతోంది. అసలు వీళ్ళిద్దరికి ఒకరిని ఒకరు చంపుకునేంత కోపం ఎలా క్రియేట్ అయింది అంటే ‘సత్య దాదా’ అనే క్యారెక్టర్ ద్వారా వీళ్ళిద్దరి మధ్య గొడవలైతే స్టార్ట్ అవుతాయట.
ఇక ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించడం విశేషం…మరి ఆయనకు ఓమికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ ఏంటి? వీళ్ళ మధ్య గొడవ పెట్టడానికి సత్య దాదా ఏం చేశాడు? అసలు వీళ్లకు సత్య దాదా మధ్య సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా ప్రీమియర్ షో స్టార్ట్ అయితే గాని పూర్తి క్లారిటీ అయితే రాదు…