OG Movie: ఓటీటీ యుగం లో ఒక సినిమా 4 వారాలు దాటి 50 రోజులు ఆడడం అంటే అద్భుతం అనే చెప్పాలి. గడిచిన రెండు మూడు సంవత్సరాలలో ‘దేవర’,’పుష్ప 2′,’కల్కి’ చిత్రాలకు మాత్రమే ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కూడా ఈ జాబితాలోకి చేరనుంది. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో అలరిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతుండడం విశేషం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం 50 రోజులు కనీసం 30 కేంద్రాల్లో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులు తర్వాత ఇన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుండడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించేలా చేసింది.
వైజాగ్, గాజువాక, విజయవాడ,నంద్యాల, అనంతపురం, కడప, రైల్వే కోడూరు, గుడివాడ, కోడూరు, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజముండ్రి, కర్నూలు, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ చిత్రం నడుస్తూనే ఉంది. వీటితో పాటు మరో 40 కేంద్రాల్లో ఓజీ చిత్రం ప్రదర్శితమవుతోంది. వీటిల్లో కనీసం 30 కేంద్రాల్లో అయినా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కొత్త సినిమాలు ఎన్ని విడుదలైనప్పటికీ, ఓజీ ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుండడం వల్లే ఈ చిత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గత వారం లో కూడా ఈ చిత్రం వైజాగ్ వంటి ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఇంత రన్, అది కూడా ఈ కాలం లో అంటే మామూలు ర్యాంపేజ్ కాదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చినట్టు సినిమా తీస్తేనే ఇలా ఉంది, అదే గబ్బర్ సింగ్ రేంజ్ సినిమా పడితే ఏ రేంజ్ ప్రభంజనాన్ని ఈ సినిమా సృష్టించి ఉండేదో అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అనుకుంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు 50వ రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పెషల్ ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ఫ్యాన్ షోస్ ద్వారా కనీసం మూడు కోట్ల గ్రాస్ వసూళ్లను అదనంగా రాబట్టొచ్చు అనే ప్లానింగ్ తో ఉన్నారు. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక సినిమాకు 50వ రోజున ఇంత గ్రాస్ వసూళ్లు రావడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇండియా వైడ్ గా ఎక్కడా కూడా జరగలేదు. ఒకవేళ ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే మాత్రం ఆల్ టైం ఇండియన్ రికార్డు పవన్ ఫ్యాన్స్ ఖాతాలో ఉంటుంది.