OG vs Kantara 2 : సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంటుంది. ఇక పండగ రోజున సినిమాల మధ్య పోటీ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఓజీ సినిమా ట్రైలర్ అయితే గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనం తెలిసిందే. మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమాలతో ఆయన చాలా వరకు మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు అవకాశం దొరికిన ప్రతీసారి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ తన అభిమానులను ఆనందింపజేస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజువల్స్ గాని, ఆ గ్రాండియర్ గాని, షాట్ మేకింగ్ గాని అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అది షాట్ ప్రజెంట్ చేసిన విధానం వల్ల సినిమాకి చాలా హైప్ అయితే వచ్చింది…
ఇక ‘కాంతార 2’ సినిమా కూడా గత కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ట్రైలర్ ను కనక మనం లో అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైలర్ అంత కన్ఫ్యూజన్ తో కూడుకున్నట్టుగా ఉంది. అడవిలో నివసిస్తున్న ఒక తెగకు సంబంధించిన అలాగే అడవిని పరిపాలిస్తున్న రాజులకు మధ్య జరగబోతోంది. ఇక ఈ గొడవలో ఎవరు ఎలాంటి విజయం సాధిస్తారు. ఎవరు ఎవరిమీద అధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అనే ఒక క్యూరియాసిటిని రేకెత్తిస్తూ సినిమా చేశారు…ఇక ఎందుకని వాళ్ళు అలా కన్ఫ్యూజన్ తో కూడిన ట్రైలర్ ని కట్ చేశారనేది ఎవరికీ తెలియడం లేదు…
ఈ రెండు సినిమాల ట్రైలర్లలో ఓజీ ట్రైలర్ అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో ‘ఓజీ’ తో పోలిస్తే ని ‘కాంతార 2’ ట్రైలర్ చాలా వరకు డౌన్ అయిందనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాల ట్రైలర్ లో ఓజీ మూవీ ట్రైలర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది…