My Baby Movie: ఈ ఏడాది అటు తమిళం లో కానీ ఇటు తెలుగు లో కానీ పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కే సినిమాల కన్నా, ఆడియన్స్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలా తమిళం లో రీసెంట్ గా విడుదలైన DNA అనే చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి వసూళ్లతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ చిత్రం లో హీరో గా ఆతర్వ(Atharva Murali)(గద్దలకొండ గణేష్ ఫేమ్) నటించగా, హీరోయిన్ గా నిమిషాల సజయాన్ నటించింది. మన టాలీవుడ్ లో ధ్రువ, సాహూ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రెడ్ జైన్ట్ మూవీస్ సంస్థ తమిళనాడు గత నెల 20 న గ్రాండ్ గా రిలీజ్ చేసింది.
Also Read: ఈ ఏడాదిలోనే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..సెన్సేషనల్ డేట్ ని లాక్ చేసిన మేకర్స్!
ఈ చిత్రాన్ని తెలుగు లో ఇప్పుడు ‘మై బేబీ'(My Baby) పేరు తో నిర్మాత సురేష్ కొండేటి(Suresh Kondeti) ఈ నెల 11 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. డబ్బింగ్ చిత్రాలతో హిట్ కొట్టడం సురేష్ కొండేటి కి కొత్తేమి కాదు. గతం లో ఈయన నిర్మాతగా వ్యవహరించిన ‘ప్రేమిస్తే‘,’జర్నీ‘, ‘షాపింగ్ మాల్‘, ‘పిజ్జా‘ వంటి చిత్రాలు తెలుగు లో ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి మన అందరికీ తెలిసిందే. అలా ఇప్పటి వరకు ఆయన దాదాపుగా 15 సినిమాలను ఆయన నిర్మించాడు. ‘మై బేబీ’ చిత్రం ఆయనకు నిర్మాతగా 16 వ చిత్రం, అంతే కాకుండా ఇప్పటి వరకు ఆయన 85 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాడు. అందుకే సురేష్ కొండేటి ఒక సినిమా కొన్నాడంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది అనే పేరు అయితే ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు.
Also Read: నటుడు శ్రీకాంత్ కి బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు..అసలు ఏమైందంటే!
మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు కాబట్టి కాస్త ప్రొమోషన్స్ చేస్తే ఈ సినిమా తెలుగు లో కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి సినిమా విడుదలైతే థియేటర్స్ కి వెళ్ళడానికి ప్రేక్షకులు సిద్ధం గానే ఉన్నారు, కానీ అలాంటి సినిమాలే రావడం లేదు. రీసెంట్ గా విడుదలైన ‘కుబేర’ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత విడువులైన ‘కన్నప్ప’, ‘తమ్ముడు’ చిత్రాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే కచ్చితంగా భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కమర్షియల్ గా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి తమిళ డబ్బింగ్ సినిమా డ్రాగన్. ‘మై బేబీ’ విజయవంతమైన రెండవ డబ్బింగ్ సినిమాగా నిలుస్తుందో లేదో చూడాలి.