Pawan Kalyan Ustad Bhagat Singh release date : సినిమాల విషయం లో ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పీడ్ మామూలుగా లేదు. మొదటి పది నెలలు ఉప ముఖ్యమంత్రిగా పాలనలో క్షణం తీరిక లేకుండా గడుపుతూ, బ్యాలన్స్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్, కాస్త గ్యాప్ తీసుకొని, ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ'(They Call Him OG) చిత్రాల షూటింగ్స్ ని పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ప్రతీ రోజు ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నాడని టాక్. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వచ్చింది. ఈ నెలాఖరుతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చెయ్యాలని డైరెక్టర్ హరీష్ శంకర్ అనుకుంటున్నాడట.
Also Read: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
అంతే కాదు ఈ సినిమా విడుదలకు మూడు తేదీలను అనుకుంటున్నారట. అందులో ఒకటి డిసెంబర్. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. క్రిస్మస్ కి ఇప్పటికే అవతార్ సినిమాని విడుదల చేయబోతున్నామని ఆ చిత్ర మేకర్స్ చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ అదే జరిగితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓవర్సీస్ లో థియేటర్స్,షోస్ చాలా తక్కువ దొరికాయి. అవతార్ వాయిదా పడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే కచ్చితంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ క్రిస్మస్ కి వస్తుంది, లేదంటూ రాదు. ఒకవేళ క్రిస్మస్ కి రాకపోతే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కూడా విడుదల అవుతుంది కాబట్టి, ఒకసారి చిరంజీవి తో చర్చలు జరిపి, ఆ తర్వాత సంక్రాంతికి విడుదల చెయ్యాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటారట.
Also Read: కింగ్డమ్’ మరోసారి వాయిదా పడబోతోందా..? కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
ఒక చిరంజీవి ఒప్పుకోకపోతే జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా గ్రాండ్ గా విడుదల చెయ్యాలనే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్. అదే కనుక జరిగితే 7 నుండి 8 నెలల్లో మూడు పవన్ కళ్యాణ్ సినిమాలు అభిమానుల ముందుకు రాబోతున్నాయి అనుకోవచ్చు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈ నెల 24 న విడుదల కాబోతుంది. అదే విధంగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఓజీ’ చిత్రం. ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత కొద్దినెల గ్యాప్ లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మూడు సినిమాలు కూడా మినిమం గ్యారంటీ కంటెంట్ ఉన్న సినిమాలు. పాజిటివ్ టాక్ వస్తే వందల కోట్ల రూపాయిల బిజినెస్ కేవలం పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే జరుగుతుంది.