
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మలయాళి ముద్దుగుమ్మ ‘మియా జార్జ్’. తెలుగు రెగ్యులర్ ప్రేక్షకులకు ఈ భామ తెలియకపోయినా తెలుగు నెటిజన్లకు మాత్రం ఈ భారీ బ్యూటీ బహు బాగా తెలుసు. అయితే తాజాగా ఈ భామ తన ఫాలోవర్స్ తో పాటు అందరికీ సడెన్ షాక్ ఇచ్చింది.
ఉన్నట్టు ఉండి తనకు కొడుకు పుట్టాడు అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. పైగా తన కొడుకు పేరు కూడా అధికారికంగా ప్రకటించి మొత్తానికి ఈ రోజు వార్తల్లో మియా చర్చనీయాంశం అయ్యింది. మియా ఇచ్చిన సడెన్ ట్విస్ట్ కి ఆమె సన్నిహితులు కూడా షాక్ అయ్యారు.
ఎందుకంటే ఇప్పటి వరకు మియా జార్జ్ అసలు గర్బవతి అయిన విషయమే ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆమె సోషల్ మీడియా ద్వారా అకూడా ఈ విషయాన్ని షేర్ చేయలేదు. తాను గర్బవతి అని కూడా చెప్పకుండానే డైరెక్ట్ గా మగ బిడ్డకు జన్మనిచ్చాను అని ఈ భామ చెప్పడంతో మొత్తానికి ఇది హాట్ టాపిక్ అయ్యింది.
ఇక మియా జార్జ్ ఇచ్చిన షాక్ నుండి మెల్లగా కోలుకున్న ఆమె అభిమానులు, ప్రస్తుతం ఆమెకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ మియా జార్జ్ కొడుకు పేరు ఏమిటంటే.. లుకా జోసెఫ్ అట, ఈ పేరు కూడా తనే పెట్టింది.
అన్నట్టు తన కొడుకుకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కావాలని ఈ అమ్మడు అందర్నీ రిక్వెస్ట్ చేసింది. ఇక తన భర్త మరియు తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను మియా జార్జ్ షేర్ చేయడంతో ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతోంది.