https://oktelugu.com/

Military Sleep: మిలిటరీ స్లీప్‌తో నిద్రలేమి సమస్యలకు చెక్

చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మాత్రం మిలిటరీ స్లీప్ బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ మిలటరీ స్లీప్ అంటే ఏమిటి? దీనివల్ల నిద్రలేమికు చెక్ పెట్టడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2024 / 10:53 PM IST

    sleep

    Follow us on

    Military Sleep: ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా ముఖ్యమైనది. కంటి నిండా నిద్రపోతేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఏ వయస్సు వారికైనా కూడా సరిపడా నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. పగలు, రాత్రి తేడా లేకుండా మొబైల్స్ చూడటం వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మాత్రం మిలిటరీ స్లీప్ బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ మిలటరీ స్లీప్ అంటే ఏమిటి? దీనివల్ల నిద్రలేమికు చెక్ పెట్టడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    మిలిటరీ స్లీప్ అంటే కళ్లు మూసిన రెండు నిమిషాల్లోనే నిద్రపట్టడం. చాలా మందికి బెడ్ మీదకు వెళ్లిన గంటలకి నిద్రపడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మిలిటరీ స్లీప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మిలిటరీ స్లీప్‌ కోసం ముందుగా రెండు కళ్లు మూసుకుని, చేతులను పక్కన ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ.. వదలాలి. ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి.. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలు మెదడులోకి తీసుకురాకూడదు. మీకు నచ్చిన విషయాలను గుర్తు చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు నిద్రలోకి జారుకుంటారు. ఇదంతా కేవలం ఒక రెండు నిమిషాల్లోనే జరిగిపోతుంది. బెడ్ మీదకు వెళ్లిన 5 నిమిషాల లోపల ఇలా నిద్రపడితే వారి కంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మీరు హాయిగా డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతారు. ఒకరోజు ఇలా నిద్రపోవడం వల్ల రోజూ మీకు అదే సమయానికి ఈజీగా నిద్రపడుతుంది. అలాగే ఉదయం కూడా మీరు అనుకున్న సమయానికి నిద్ర లేస్తారు. మీకు అసలు నిద్రలేమి సమస్య ఉండదు.

    నిద్రలేమి సమస్యలు ఉండకూడదంటే పడుకునే రెండు గంటల ముందు అసలు మొబైల్ చూడకూడదు. అలాగే మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదు. అలాగే నిద్రపోవడానికి రెండు గంటల ముందు డిన్నర్ చేయాలి. నిద్రపోయే సరికి మీరు తినే ఫుడ్ జీర్ణం కావాలి. అలాగే కెఫిన్, నిద్రకు భంగం కలిగించే ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా నిద్రపోయే ముందు స్నానం చేయాలి. అందులోనూ వేడి నీరు స్నానం అయితే బాగా నిద్రపడుతుంది. వీటితో పాటు డైలీ వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు కూడా గురికాకుడదు. ఏ విషయం గురించి అయిన ఎక్కువగా ఆలోచిస్తే టెన్షన్‌కి సరిగ్గా నిద్ర కూడా పట్టదు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.