https://oktelugu.com/

Manchu Manoj-Rajamouli combination : మంచు మనోజ్, రాజమౌళి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే కెరీర్ మరోలా ఉండేది!

ఈ చిత్రాలన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు మనోజ్, రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట. ఆ సినిమా మరేదో కాదు 'బాహుబలి' సిరీస్. ఈ చిత్రం లో భల్లాల దేవ గా నటించిన రానా దగ్గుబాటి క్యారక్టర్ ని మనోజ్ తో వేయించాలని అనుకున్నాడట డైరెక్టర్ రాజమౌళి.

Written By:
  • Vicky
  • , Updated On : December 17, 2024 / 10:25 PM IST

    Manchu Manoj-Rajamouli combination

    Follow us on

    Manchu Manoj-Rajamouli combination : గత వారం రోజుల నుండి మంచు మనోజ్ పేరు మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. తన హక్కుల కోసం సొంత తండ్రి తో, అన్నయ్య తో పోరాటం చేస్తూ, వాళ్ళ మీదనే కేసు పెట్టిన పెట్టాడు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యని రోడ్డు మీదకు తెచ్చాడంటే, అతను ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. తండ్రి, అన్నయ్య ఎలా ఉన్నా, తన తల్లి అయినా మనోజ్ కి తోడు ఉంది అనుకుంటే, ఆమె కూడా ఇతనికి వ్యతిరేకంగా లేఖ రాసి ఈరోజు ఉదయం మీడియా కి విడుదల చేసింది. ఇలా మనోజ్ కి తన భార్య మౌనిక, మరియు అతని పిల్లలు తప్ప, ఎవ్వరూ తోడు లేరు అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే మనోజ్ గురించి ఎవ్వరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

    మంచు మోహన్ బాబు కుటుంబంలో అందరికంటే మనోజ్ కి సినీ హీరో గా ఎక్కువ క్రేజ్ ఉంది. కెరీర్ పరంగా మంచిగానే వెళ్తున్నప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరం గా ఉండిపోయాడు మనోజ్. అలా దూరం మైంటైన్ చేసి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రాలన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు మనోజ్, రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట. ఆ సినిమా మరేదో కాదు ‘బాహుబలి’ సిరీస్. ఈ చిత్రం లో భల్లాల దేవ గా నటించిన రానా దగ్గుబాటి క్యారక్టర్ ని మనోజ్ తో వేయించాలని అనుకున్నాడట డైరెక్టర్ రాజమౌళి. ముందుగా ఈ క్యారక్టర్ కోసం ఆయన రానా దగ్గుబాటి నే అడిగాడట. కానీ రానా ఇప్పుడిప్పుడే హీరో గా నిలదొక్కుకుంటున్నాను, ఇలాంటి సమయంలో విలన్ రోల్ అంటే నా కెరీర్ గాడి తప్పుతుందేమో సార్ అని అన్నాడట.

    దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ‘ఇది చాలా సాలిడ్ స్క్రిప్ట్..మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రప్పించే సినిమా. అలాంటి సినిమాలో నువ్వు మెయిన్ విలన్ అంటే, నీ రేంజ్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది’ అని అన్నాడట. దానికి రానా దగ్గుబాటి బాగా ఆలోచించుకొని రెండు రోజుల తర్వాత రాజమౌళి కి ఓకే చెప్పాడట. రానా ఓకే చెప్పేలోపు రాజమౌళి చాలా టెన్షన్ పడ్డాడట. ఇప్పుడు ఈయన ఈ సినిమా ఒప్పుకుంటాడా లేదా?, ఒప్పుకోకపోతే ఎవరిని తీసుకోవాలి? అని ఆలోచిస్తున్న సమయంలో ఆయన బుర్రలోకి మంచు మనోజ్ ని తీసుకోవాలని అనిపించిందట. రానా ఒకవేళ ఒప్పుకోకపోయ్యుంటే, మనోజ్ ఆ క్యారక్టర్ ని చేసేవాడు. ఈ రోజు ఆయన లెవెల్ ఊహించని రేంజ్ లో ఉండేది. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఇప్పుడు మనోజ్ రీ ఎంట్రీ లో ఎక్కువగా విలన్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తేజ సజ్జ హీరో గా నటిస్తున్న ‘మిరాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న ‘భైరవం’ వంటి చిత్రాల్లో విలన్ గా నటిస్తున్నాడు.