https://oktelugu.com/

Drinking Milk: పాలలో ఇవి కలిపి తాగితే.. గుండె సమస్యలన్నీ పరార్

ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పాలు తాగుతుంటారు. కేవలం పాలు మాత్రమే కాకుండా ఇందులో కొన్ని పదార్థాలను కలిపి తాగితే దీర్ఘకాలికంగా బాధపడుతున్న అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి పాలలో కలపాల్సిన ఆ పదార్థం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : December 17, 2024 / 11:32 PM IST

    Drinking Milk

    Follow us on

    Drinking Milk : పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు ఎముకలను బలంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా పాలు తాగుతారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి పాలు తాగించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఆవు పాలు కంటే ప్యాకెట్ పాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని పాశ్చరైజ్ చేసి అమ్ముతారు. దీంతో ఇందులో పోషకాలు పెద్దగా ఉండవు. దీనికి తోడు ఈ రోజుల్లో పాలను కల్తీ కూడా చేస్తున్నారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పాలు తాగుతుంటారు. కేవలం పాలు మాత్రమే కాకుండా ఇందులో కొన్ని పదార్థాలను కలిపి తాగితే దీర్ఘకాలికంగా బాధపడుతున్న అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి పాలలో కలపాల్సిన ఆ పదార్థం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూర పండ్లను పాలలో కలిపి తీసుకోవాలి. పాలు వేడి చేస్తున్నప్పుడు అందులో ఒక నాలుగు ఖర్జూర గింజలు వేయాలి. ఇలా మరిగిన పాలను ఆ ఖర్జూర పండ్లతో తీసుకోవడం వల్ల బలంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే పిల్లలు బరువు కూడా పెరుగుతారు. కొందరు నీరసం, అలసటగా ఉంటారు. అలాంటి వారు పాలలో ఇలా ఖర్జూరం వేసుకుని తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. పాలు, ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. ఖర్జూరంలోని విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. నిద్రపోయే ముందు ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా క్లియర్ అవుతుంది.

    ఖర్జూరం, పాలలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే రక్తహీనత సమస్యను కూడా క్లియర్ చేస్తాయి. రోజూ ఇలా ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని పోషకాలు చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా అందంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొందరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం క్లియర్ అవుతాయి. ముఖ్యంగా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా పాలలో కలిపి తాగలేని వారు ఖర్జూరంతో మిల్క్ షేక్ చేసుకుని కూడా తాగవచ్చని నిపుణులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.