Unstoppable with NBK: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆల్ రెడీ మహేష్ తో ఆ ఎపిసోడ్ ను షూట్ చేశారు. అది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. పైగా అదే చివరి ఎపిసోడ్ అని గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే, అదే నిజం ఆహా సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు అట. అలాగే మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు అని తెలుస్తోంది. ఆ సమయంలో బాలయ్యతో మహేష్ తన సేవా కార్యక్రమాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారట.
తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను తానూ దత్తత తీసుకున్నట్లు, ఆ గ్రామాల్లో తాను ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాడు లాంటి విషయాలను కూడా మహేష్ ఈ ఎపిసోడ్ లో చెప్పారట. ఈ క్రమంలోనే తన సంపాదనలో నుంచి 30% వరకు వృద్ధాశ్రమాలు, పిల్లల ఆరోగ్య సంబంధిత ‘NGO’లకు విరాళంగా ఇస్తున్నట్లు మహేష్ ఓపెన్ అయ్యాడని తెలుస్తోంది.
Also Read: ప్చ్.. చిరు ఈ ఆశ భావం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ?
ఎపిసోడ్ మొత్తంలో మహేష్ – బాలయ్య మధ్య జరిగిన సంభాషణలు ఇరువురు హీరోల ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయట. ప్రస్తుత తెలుగు వెండితెర పై టాప్ హీరోలుగా రాణిస్తోన్న ఈ ఇద్దరూ… బుల్లితెరపై కూడా స్క్రీన్ స్పేస్ తో పాటు ఎమోషన్స్ ను, ఎక్స్ ప్రెషన్స్ ను కూడా షేర్ చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.
మరి ఈ ప్రత్యేక ఎపిసోడ్ కి భారీ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఆహా టీమ్ నమ్మకంగా ఉంది. ఏది ఏమైనా ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షో సూపర్ హిట్ అవ్వడం.. మొత్తమ్మీద బాలయ్య అంటే ఏమిటో అందరికీ అర్థం అయింది. ఆయన హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యారు.
Also Read: విశాల్ “సామాన్యుడు” మూవీ టీజర్ రిలీజ్…