Homeఎంటర్టైన్మెంట్Actress Rakul: ప్రియుడికి ప్రేమగా బర్త్ డే విషెస్ చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్...

Actress Rakul: ప్రియుడికి ప్రేమగా బర్త్ డే విషెస్ చెప్తున్న రకుల్ ప్రీత్ సింగ్…

Actress Rakul: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి… టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.

actress rakul preeth singh posted birth day wishes to her boy friend

కాగా తన పుట్టిన రోజునాడు తన ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ పంజాబీ బ్యూటీ. బాలీవుడ్‌ యంగ్‌ ప్రొడ్యూసర్‌ జాకీభగ్నానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన రకుల్‌… తమ పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. 2018లో ‘అయ్యారే’ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఆతర్వాత ‘దేదే ప్యార్‌ దే’, ‘మర్జావన్‌’, ‘సిమ్లా మిర్చి’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే తాజాగా తన ప్రియుడి పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ ముద్దుగుమ్మ. భగ్నానీ ఫొటోను షేర్‌ చేస్తూ ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. పక్కనున్న వారిని కూడా నవ్విస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్‌డే’ అంటూ బర్త్‌ డే విషెస్‌ చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం తెలుగులో విడుదలైన ‘కొండపొలం’ లో ఓబుళమ్మగా ఆకట్టుకున్న రకుల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘అటాక్‌’, ‘రన్‌వే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జి’ అనే హిందీ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు కొన్ని తమిళ సినిమాలకు కూడా ఓకే చెప్పింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular