Prakasam: అటు ఎన్నికల హడావుడి.. ఇటు అర్ధరాత్రి వింత శబ్దాలు.. తీరా చూస్తే..!

ఆంధ్రప్రదేశ్‌లోపి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో అర్ధరాత్రి పెద్దపెద్ద శబ్దాలు వచ్చాయి. వాటిని విన్న గ్రామస్తులు ఎన్నికలు కదా.. ఏదైనా పని జరుగుతుందేమో అనుకున్నారు. కానీ తెల్లవారి చూసే గ్రామంలోని పురాతన ముక్తేశ్వరాలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 6:29 pm

Prakasam

Follow us on

Prakasam: రెండు రోజుల క్రితం వరకు అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉన్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు.. ఆ గ్రామంలో మాత్రం అర్ధరాత్రి వింత శబ్దాలు. అందురూ ఎన్నికల గురించి చర్చించుకుంటుంటే.. ఆ ఊళ్లో మాత్రం అర్ధరాత్రి శబ్దాల గురించే చర్చించుకుంటున్నారు. అంతా పడుకున్న తర్వాత వస్తున్న శబ్దాలతో మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెల్లారి చూసి అంతా అవాక్కయ్యారు. అందరూ ఇలా జరిగిందేంటి అని నోరెల్లబెట్టారు. ఎందుకు ఇలా జరిగింది. ఎందుకు ఇలా చేశారు అని మాట్లాడుకున్నారు.

ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోపి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో అర్ధరాత్రి పెద్దపెద్ద శబ్దాలు వచ్చాయి. వాటిని విన్న గ్రామస్తులు ఎన్నికలు కదా.. ఏదైనా పని జరుగుతుందేమో అనుకున్నారు. కానీ తెల్లవారి చూసే గ్రామంలోని పురాతన ముక్తేశ్వరాలయంలో దుండగులు తవ్వకాలు జరిపారు. ఉదయం ఆలయ పూజారి గుడిలోకి అడుగుపెట్టారో లేదో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని పెకిలించినట్లు కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా గోతి తవ్వినట్లు కనిపించింది వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు.

పోలీసులకు ఫిర్యాదు..
నంది విగ్రహాన్ని పెకిలించినట్లు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుడిలో కూడా విగ్రహం తవ్వి ఉన్నాయి. గుప్త నిధుల కోసమే ఇలా చేశారని భావిస్తున్నారు. అర్చకుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.