Chanakya Niti: కొన్ని సంవత్సరాల క్రితం బాల్యవివాహాలు రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ వివాహాలు జరగడం లేదు. చాలా రేర్ గా జరుగుతున్నాయి. ఇక కొన్ని సందర్భాలలో మాత్రం వయసు తేడా ఉన్న పెళ్లిల్లు మాత్రం జరుగుతున్నాయి. కానీ ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయట. వయసును బట్టి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుందట. చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం మీ జీవితంలో అనేక విధాలుగా సమస్యలను కలిగిస్తుంది. అవి ఏంటో తెలుసుకోవచ్చు.
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య వయస్సు చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. అందుకే భార్యభర్తల మధ్య వయసు గ్యాప్ ఎక్కువగా ఉండకూడదు అని.. ఉంటే వైవాహిక జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయని చాణక్యుడు చెప్పాడు. వృద్ధుడు యువతిని వివాహం చేసుకోకూడదు. అలాంటి వివాహం ఏ విధంగానూ చెల్లదు. ఈ సంబంధం ఎల్లప్పుడూ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అలాంటి వివాహాలు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. అలాంటి వివాహం విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు.
భార్యాభర్తల మధ్య సంబంధంలో ఇద్దరూ ఒకరినొకరు అన్ని విధాలుగా సంతృప్తి పరచాలని చాణక్యుడు చెప్పాడు. వయసులో ఎక్కువ తేడా ఉంటే వారి ఆలోచనలలో కూడా చాలా తేడా ఉంటుంది.. వారు ఒకేలా ఆలోచించకపోవచ్చు. వృద్ధుడు యువతిని పెళ్లాడితే అలాంటి దాంపత్యంలో రోజురోజుకూ విభేదాలు పెరుగుతాయి.
వైవాహిక జీవితంలో ఆనందం పొందాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. ఈ పవిత్ర సంబంధం యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. అలా చేసుకుంటే.. కుటుంబం వైవాహిక జీవితం త్వరలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది.
భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది. ఇక వీరిద్దరి మధ్య సఖ్యత ఉండాలంటే ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలట. భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం ఎప్పుడూ ఒకేలా ఉండాలని కూడా అంటారు చాణక్యుడు.