HomeNewsKannappa Teaser Review: కన్నప్ప టీజర్ రివ్యూ: మంచు విష్ణు సాహసం, ప్రభాస్ లుక్ ఎలా...

Kannappa Teaser Review: కన్నప్ప టీజర్ రివ్యూ: మంచు విష్ణు సాహసం, ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే?

Kannappa Teaser Review: మంచు విష్ణు అతిపెద్ద సాహసానికి ఒడిగట్టాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇది సాహసం అనడానికి కారణం… ఆయనకు కనీస మార్కెట్ లేదు. మంచు విష్ణు సినిమా విడుదలైతే ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఉండటం లేదు. ఆయన గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మాత్రం రెండు కోట్లు మించలేదు. అంత దారుణంగా ఆయన మార్కెట్ పడిపోయింది. అలాంటి హీరో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో మూవీ చేయడం అంటే… కత్తి మీద సామే.

అందుకే తెలివిగా మంచు విష్ణు పరిశ్రమలకు చెందిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి నటులను ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేశాడు. ప్రభాస్ ఓ పాత్ర చేయడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. 80 శాతం మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో చేశారు. షూటింగ్ కి కావలసిన ప్రాపర్టీస్ షిప్పులో న్యూజిలాండ్ కి తరలించారు. కన్నప్ప మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు.

Also Read: Sreeleela: శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

జూన్ 14న కన్నప్ప టీజర్ విడుదలైంది. ఒకటిన్నర నిమిషానికి పైగా ఉన్న కన్నప్ప టీజర్ ఎలా ఉందో చూద్దాం… మంచు విష్ణు క్యారెక్టర్ ఎలివేషన్ తో టీజర్ సాగింది. శివలింగాన్ని పెకలించి తీసుకురమ్మని పంపిన టెంకన ను తిన్నడు(మంచు విష్ణు) చంపేస్తాడు. కాలముఖ తమ్ముడైన టెంకన అత్యంత బలవంతుడు. వంద మంది కలిసినా చంపలేరు. అలాంటి టెంకన ను చంపిన తిన్నడు పై కాలముఖ దాడి చేస్తాడు…

Also Read: Devara: ఎన్టీయార్ దేవర సినిమా కంటే వార్ 2 సినిమా పెద్ద విజయం సాధిస్తుందా..?

పవర్ఫుల్ హీరో, పవర్ఫుల్ విలన్ ని టీజర్ లో పరిచయం చేశారు. మేకప్, గెటప్స్ ఆకట్టుకున్నాయి. టీజర్లో అందమైన న్యూజిలాండ్ లొకేషన్స్ హైలెట్ అని చెప్పాలి. సహజమైన పచ్చిక బయళ్లు, అడవులలో చిత్రీకరణ జరిపారు. లొకేషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఒక తిన్నడుగా మంచు విష్ణు లుక్ బాగుంది. గుర్రపు స్వారీలు, విలు విద్యలు భారీగా చిత్రీకరించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లను పరిచయం చేశారు. సూచాయగా ప్రభాస్ లుక్ సైతం రివీల్ చేశారు. విభూది రాసుకుని తీక్షణంగా చూస్తున్న ప్రభాస్ కళ్ళు గూస్ బంప్స్ రేపాయి. మ్యూజిక్ పర్లేదు. మొత్తంగా కన్నప్ప టీజర్ కొంత మేర ఆకట్టుకుంది.
Kannappa Official Teaser Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar

Exit mobile version